ఫ్రీచార్జ్‌ సీఈవో రాజీనామా.. | FreeCharge CEO Govind Rajan quits | Sakshi
Sakshi News home page

ఫ్రీచార్జ్‌ సీఈవో రాజీనామా..

Published Wed, Feb 22 2017 3:45 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

ఫ్రీచార్జ్‌ సీఈవో రాజీనామా..

ఫ్రీచార్జ్‌ సీఈవో రాజీనామా..

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్‌ దిగ్గజం స్నాప్‌డీల్‌ అనుబంధ సంస్థ ఫ్రీచార్జ్‌ సీఈవో గోవింద్‌ రాజన్‌ తన పదవికి రాజీనామా చేశారు. 2015 లో రాజన్‌ ఫ్రీచార్జ్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గోవింద్‌ రాజన్‌ ఆధ్వర్యంలో ఫ్రీచార్జ్‌ ఎదుగుదలకు విశేష కృషి చేశారని స్నాప్‌డీల్‌ సహ వ్యవస్థాపకులు కునాల్‌ బాల్‌ అన్నారు. గోవింద్‌ రాజన్‌ గతంలో భారతీ ఎయిర్‌టెల్‌కు ఎక్జిక్యూటీవ్‌ సీఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే.

ఎయిర్ టెల్ నుంచి బయటకు వచ్చాక 2015 ఆగస్టులో ఫ్రీచార్జ్‌ సీఈవోగా నియమితులై దాదాపు ఏడాదిన్నర్ పాటు విశేష సేవలు అందించారు.ఇకపై ఆయన స్థానంలో నూతన సీఈవోగా జాసన్‌ కొటారీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫ్రీచార్జ్‌ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు రాజన్ తెలిపారు. గతేడాది మే నెలలో ఆనంద్‌ చంద్రశేఖరన్‌ ఫ్రీచార్జ్‌ నుంచి బయటకు వచ్చి ఫేస్‌బుక్‌ సంస్థలో జాయిన్‌ అయ్యారు. రాజన్‌ అనంతరం సీఈవోగా రానున్న జాసన్ కొటారీ ఎప్పుడు, ఎక్కడ బాథ్యతలు చేపడతారో  తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement