
సాక్షి, హైదరాబాద్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు 100% క్యాష్‌బ్యాక్ ఆఫర్‌పై ఏడీఎస్‌ఎల్ వైఫై మోడెమ్‌ను అందిస్తున్నట్లు రాష్ట్ర టెలికం సర్కిల్ సీజీఎం అనంతరామ్ వెల్లడించారు. దూరసంచార్ భవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడు తూ.. రూ.1,500 విలువ గల మోడెమ్‌పై ప్రతినెల రూ.50 చొప్పున 30 నెలల పాటు కనెక్షన్ బిల్లులో మినహాయిస్తామన్నారు. ఈ ఆఫర్ 2018 జనవరి వరకు ఉంటుందన్నారు.
దీపావళి సందర్భంగా లక్ష్మి ఆఫర్‌పై 50% అదనపు టాక్‌టైమ్ అందిస్తున్నట్లు చెప్పారు. 6 రోజులే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందన్నారు. మార్చికి వైరా, జడ్చర్లలో 4జీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని 74 ప్రాంతాల్లో వైఫై సేవలు అందిస్తున్నామన్నారు. 6 మాసాల్లో కొత్తగా 9,03,761 మొబైల్ కనెక్షన్లను అందించామన్నారు. 429 ప్లాన్‌కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. సమావేశంలో హైదరాబాద్ టెలికం పీజీఎం రాంచంద్రం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment