గ్రంథి మల్లికార్జునరావుకు ఐమా లైఫ్ టైమ్ అవార్డు | GMR Group chairman grandhi Mallikarjuna Rao gets Aima Lifetime Award | Sakshi
Sakshi News home page

గ్రంథి మల్లికార్జునరావుకు ఐమా లైఫ్ టైమ్ అవార్డు

Published Sat, Apr 18 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

గ్రంథి మల్లికార్జునరావుకు ఐమా లైఫ్ టైమ్ అవార్డు

గ్రంథి మల్లికార్జునరావుకు ఐమా లైఫ్ టైమ్ అవార్డు

సాక్షి, న్యూఢిల్లీ: జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావును ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఐమా) అవార్డు వరించింది. ఐమా సంస్థ లైఫ్ టైం కంట్రిబ్యూషన్ అవార్డును శుక్రవారం ఆయన కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రంథి మాట్లాడుతూ ఒక క్రమపద్ధతిలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా సాఫల్యత సాధించామని పేర్కొన్నారు. ఐమా వివిధ కేటగిరీల్లో మొత్తం 9 అవార్డులు ప్రదానం చేసింది.

డెరైక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా రాజ్‌కుమార్ హిరాణీ, బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్‌గా కునాల్ బాహల్, ఎంఎన్‌సీ ఇన్ ఇండియా ఆఫ్ ది ఇయర్‌గా హ్యుందాయ్ మోటార్స్, మీడియా విభాగంలో శేఖర్ గుప్తా, ఇండియన్ ఎంఎన్‌సీ ఆఫ్ ది ఇయర్‌గా సన్ ఫార్మా,  ఎంట్రప్రెన్యూర్ ఆఫ్‌ది ఇయర్‌గా నీతా ఎం.అంబానీ, బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్‌గా ఆదిత్య పూరి అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజవర్ధన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement