తొమ్మిది నెలల కనిష్టానికి బంగారం ధర!
తొమ్మిది నెలల కనిష్టానికి బంగారం ధర!
Published Wed, Oct 1 2014 2:40 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు కొద్దికాలంగా నష్టాల బాట పట్టాయి. బులియన్ మార్కెట్ లో బంగారం ఔన్స్ కు 1200 డాలర్లకు పడిపోయింది. ద్రవ్య మార్కెట్ లో డాలర్ విలువ బలంగా ఉండటం, చైనా కొనుగోలుదారుల నుంచి మద్దతు కరువు కావడంతో బంగారం ధర పతనానికి కారణానికి వ్యాపార విశ్లేషకులు భావిస్తున్నారు.
నేటి మార్కెట్ మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ లో 10 గ్రాముల బంగారం ధర 1.08 శాతం నష్టంతో 293 రూపాయలు క్షీణించి 26836 వద్ద ట్రేడ్ అవుతోంది. డిసెంబర్ కాంట్రాక్టులో 26818 రూపాయలు నమోదైంది.
Advertisement