
న్యూఢిల్లీ : దీపావళి డిమాండ్ ప్రభావంతో బంగారం ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. నేటి బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.290 పెరిగి మూడు వారాల గరిష్టానికి చేరుకుంది. పండుగ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి స్థానిక జువెల్లర్స్ ఎక్కువగా కొనుగోళ్లు చేపడుతుండటంతో బంగారం ధర రూ.31వేలను చేరుకున్నట్టు ట్రేడర్లు చెప్పారు.. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి తక్కువ డీల్స్ ఉండటంతో వెండి కేజీకి రూ.41వేలుగానే ఉంది.
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం స్థానిక ఆభరణదారుల నుంచి కొనుగోళ్లు పెరగడం, దేశీయ స్పాట్ మార్కెట్‌లో దీపావళి ఫెస్టివల్ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడమేనని తెలిసింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధరలు రూ.290 చొప్పున పెరిగి రూ.31వేలుగా, రూ.30,850గా ఉంది. అయితే గ్లోబల్‌గా మాత్రం బంగారం ధరలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఔన్స్‌కు 0.12 శాతం తగ్గి 1,283.20 డాలర్లగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment