
మూడో రోజూ క్షీణించిన బంగారం ధర
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శనివారం మరింత దిగివచ్చాయి. విదేశీ మార్కెట్లో డాలర్ తిరిగి రావడంతో సెంటిమెంట్ బలహీనంగా ఉంది. దీంతో వరుసగా మూడోరోజుకూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.55 లు క్షీణించింది. రూ. 29,370 స్థాయికి పడిపోయింది. దీంతోపాటు దేశీయ నగల మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గాయి. వెండి ధర కూడా రూ .40వేల స్థాయికినుంచి దిగివచ్చింది. రూ. 225 నష్టంతో కిలో వెండి రూ .39,900 కి చేరుకుంది. విలువైన లోహాల కోసం డిమాండ్ తగ్గడం, స్థానిక నగల స్థానిక నగల నుంచి డిమాండ్ పడిపోవడం కూడా ధరల పతనానికి కారణమని మార్కెట్ వర్గాల అంచనా.
ప్రపంచవ్యాప్తంగా బంగారం 0.88 శాతం పడిపోయి 1,266.40 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 1.35 శాతం పెరిగి 17.17 డాలర్లకు చేరుకుంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల ధర రూ. 55 తగ్గి 29,370 రూపాయలకు పడిపోయింది. గత రెండు రోజుల్లో పుత్తడి ధరలు 370 రూపాయలు క్షీణించాయి. ఫ్యూచర్స్ మార్కెట్‌లో పది గ్రా. పుత్తడి ధరలు రూ.114 తగ్గి రూ.29, 017 వద్ద ఉంది.
సావరిన్ గోల్డ్ ఎనిమిది గ్రాముల ధర రూ. 100 తగ్గి రూ .24,400 కు పడిపోయింది. వెండి ధర 225 రూపాయల నుంచి రూ. 39,900 కి చేరుకుంది.