స్వచ్ఛంద సంస్థలకు గూగుల్‌ఆర్గ్
నుంచి 8 మిలియన్ డాలర్ల గ్రాంటు
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్‌డాట్‌ఆర్గ్ తాజాగా భారత్‌లో నాలుగు స్వచ్ఛంద సేవా సంస్థలకు (ఎన్‌జీవో) 8.4 మిలియన్ డాలర్ల మేర గ్రాంట్స్ ఇచ్చింది. ఇవి టెక్నాలజీ ఆధారిత బోధన సేవలు అందిస్తున్నాయి. గ్రాంట్స్ అందుకున్న వాటిలో లెర్నింగ్ ఈక్వాలిటీ (5,00,000 డాలర్లు), మిలియన్ స్పార్క్స్ ఫౌండేషన్ (1.2 మిలియన్ డాలర్లు), ప్రథమ్ బుక్స్ స్టోరీవీవర్ (3.6 మిలియన్ డాలర్లు), ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (3.1 మిలియన్ డాలర్లు) సంస్థలు ఉన్నాయి. ఆయా సంస్థల కార్యకలాపాల విస్తరణకు తోడ్పడేలా రెండేళ్ల పాటు ఈ గ్రాంట్ అందించనున్నట్లు గూగుల్ ఆగ్నేయాసియా విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు.