పుత్తడి పై కొత్త ఆంక్షలు ఉండవు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై కొత్త ఆంక్షలను కేంద్రం విధించబోదని వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ బుధవారం తెలిపారు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పూర్తిగా అదుపులో ఉండడమే దీనికి కారణమని తెలిపారు. క్యాడ్‌కు మరింత సానుకూలమైన రీతిలో 2014 డిసెంబర్‌లో కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి జరిగినట్లు వెల్లడించారు. జనవరిలో ఇప్పటి వరకూ 7 టన్నుల దిగుమతి జరిగిందన్నారు. భారత్ బంగారం దిగుమతులు నవంబర్‌లో 151.59 టన్నులు.
పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం: విలేకరులతో మాట్లాడడానికి ముందు రాజీవ్ ఖేర్ పసిడి పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత్ రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య డెరైక్టర్ బాచ్‌రాజ్ బమల్వా విలేకరులతో మాట్లాడుతూ, ‘దిగుమతి సుంకాన్ని సైతం తగ్గించే విషయాన్ని పరిశీలిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది’’ అని తెలిపారు.