
ముంబై: రానున్న ఆర్థిక సంవత్సరాని(2018–19)కి దేశ జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందన్న అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ మరోసారి పునరుద్ఘాటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగించడానికి డీమోనిటైజేషన్, జీఎస్టీ వల్ల స్వల్ప కాలంలో ఎదురైన ప్రతికూలతలు, వ్యవసాయ వృద్ధి బలహీనంగా ఉండడమే కారణాలుగా పేర్కొంది.
జీఎస్టీ ప్రతికూల ప్రభావం కొనసాగుతుందన్న అంచనాలతోనే రానున్న ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 7.6 శాతంగా పేర్కొంటున్నట్టు వివరించింది. ప్రైవేటు వినియోగం 2017 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతంగా ఉండగా, అది 2018 ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతం ఉండొచ్చని అభిప్రాయపడింది. అయినప్పటికీ జీడీపీలో 55.7 శాతంతో ఇదే అతిపెద్ద వాటాదారు అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment