హెచ్ సీజీ ఐపీఓ ధరల శ్రేణి రూ.205-212 | HCG fixes IPO price band at Rs 205-218; to open on March 16 | Sakshi
Sakshi News home page

హెచ్ సీజీ ఐపీఓ ధరల శ్రేణి రూ.205-212

Published Thu, Mar 10 2016 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

హెచ్ సీజీ ఐపీఓ ధరల శ్రేణి రూ.205-212

హెచ్ సీజీ ఐపీఓ ధరల శ్రేణి రూ.205-212

ఈ నెల16-18 మధ్య ఐపీఓ
ముంబై: క్యాన్సర్ కేర్ నెట్‌వర్క్ సంస్థ హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ (హెచ్‌సీజీ) తన ఐపీఓకు ధరల శ్రేణిని రూ.205-212గా నిర్ణయించింది. ఈ నెల 16న నుంచి ప్రారంభమయ్యే ఈ ఐపీఓ 18న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా 1.16 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను, 1.82 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో జారీ చేయనున్నారు. ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్‌అవుతాయి.  ధరల శ్రేణిలోని ఎగువ ధర ప్రకారం ఈ ఐపీఓ ద్వారా హెచ్‌సీజీ  రూ.650 కోట్ల నిధులు సమీకరిస్తుందని అంచనా.

   క్లుప్తంగా...
క్రాంప్టన్ గ్రీవ్స్: భారత్ వెలుపలి ట్రాన్సిమిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్(టీ అండ్ డీ) వ్యాపారాన్ని అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, ఫస్ట్ రిజర్వ్ ఇంటర్నేషనల్‌కు రూ.851 కోట్లకు విక్రయించింది.

యస్ బ్యాంక్: విదేశీ పెట్టుబడి పరిమితిని 41 శాతం నుంచి 74 శాతానికి పెంచుకోవడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక బోర్డ్(ఎఫ్‌ఐపీబీ) అనుమతినిచ్చింది.

♦  క్యాడిలా హెల్త్‌కేర్: కేన్సర్ చికిత్సలో ఉపయోగపడే క్లోఫరబైన్ ఇంజెక్షన్‌కు అమెరికా ఎఫ్‌డీఏ నుంచి తాత్కాలిక ఆమోదం పొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement