
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. సీ3ఐ సొల్యూషన్లను చేజిక్కించుకుంది. మెర్క్ అండ్ కోకు పూర్తి అనుబంధంగా ఉంటూ స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహించే అనుబంధ సంస్థ, సీ3ఐ సొల్యూషన్లను 6 కోట్ల డాలర్లకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. జీవ, వినియోగ శాస్త్రాల్లో వృద్ధి జోరు పెంచుకునే వ్యూహంలో భాగంగా ఈ కంపెనీని హెచ్‌సీఎల్ టెక్ చేజిక్కించుకుంది.
ఈ కంపెనీ కొనుగోలుతో తమ ఐటీ, వ్యాపార సేవలు మరింత విస్తరిస్తాయని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయకుమార్ తెలిపారు. ఈ కొనుగోలులో భాగంగా సీ3ఐ సొల్యూషన్లను నిర్వహించే టెలెరెక్స్ మార్కెటింగ్ కంపెనీలో 100% వాటాను తమ అనుబంధ సంస్థ, హెచ్‌సీఎల్ అమెరికా ఇన్‌కార్పొ కొనుగోలు చేస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment