
సాక్షి, ముంబై : ఆర్‌బీఐ కీలక రెపో రేటును పెంచిన క్రమంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సోమవారం వివిధ కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని 0.6 శాతం వరకూ పెంచింది. సవరించిన వడ్డీ రేటు తక్షణమే అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది.
ఎఫ్‌డీ రేట్లను పెంచడంతో రుణాలపై వడ్డీరేట్లకూ రెక్కలు వస్తాయని భావిస్తున్నారు. రుణాలపై వడ్డీ రేటు పెరిగితే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న కస్టమర్ల ఐఎంఐలు భారమవుతాయి. కాగా, 6 నెలల నుంచి ఐదేళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేట్లను హెచ్‌డీఎఫ్‌సీ పెంచింది. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ ఇప్పటికే డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment