బ్యాంకుల్లో రోబోలు.. త్వరలో ప్రారంభం
త్వరలో ముంబై శాఖలో ప్రారంభం
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఖాతాదారులకు రోబోలతో సేవలు అందించనుంది. ’ఇరా’ పేరిట రూపొందించిన ఈ హ్యూమనాయిడ్ సర్వీసులను త్వరలో ముంబై నగర శాఖలో ప్రారంభించనుంది. కొచ్చికి చెందిన అసిమోవ్ రోబోటిక్స్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ నిలువెత్తు రోబోను.. సోమవారం ఆవిష్కరించారు. దేశీ బ్యాంకింగ్ రంగంలో ఇదే తొలి హ్యూమనాయిడ్ అని హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్ బ్యాంకింగ్ విభాగం హెడ్ నితిన్ చుగ్ చెప్పారు. ఈ రోబో ఎటువంటి సేవలు అందిస్తుందన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే, ఈ రోబో.. రిసెప్షనిస్టులాగా వ్యవహరించవచ్చని, నిర్దిష్ట సేవలకు మాత్రమే పరిమితం కావొచ్చని సమాచారం.
సిటీ యూనియన్ బ్యాంక్ గతేడాదే ఈ తరహా రోబో ’లక్ష్మి’నిప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది 125 పైగా అంశాలను హ్యాండిల్ చేయగలదు. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల కార్యకలాపాలకు తోడ్పాటు అందించే టెక్నాలజీలను అభివృద్ధి చేసేలా స్టార్టప్ సంస్థలతో చేతులు కలపనున్నట్లు చుగ్‌వివరించారు. అటు స్టార్టప్‌లకు తోడ్పాటునిచ్చేందుకు ఉద్దేశించిన రెండో విడత సమిట్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రారంభించింది. తొలి విడత సమిట్‌లో 100 ఎంట్రీలు రాగా.. 35 స్టార్టప్ సంస్థలు కొత్త ఐడియాలను ప్రతిపాదించాయి. బ్యాంకుతో కలిసిపనిచేసేందుకు వీటిలో అయిదింటికి అవకాశం దక్కింది.