ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా హేమంత్‌ భార్గవ బాధ్యతలు | Hemant Bhargava assumes office as LIC's second MD | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా హేమంత్‌ భార్గవ బాధ్యతలు

Published Tue, Feb 14 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా హేమంత్‌ భార్గవ బాధ్యతలు

ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా హేమంత్‌ భార్గవ బాధ్యతలు

హైదరాబాద్‌: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా హేమంత్‌ భార్గవ ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇప్పటివరకూ ఢిల్లీ, పంజాబ్, రాజస్తాన్, హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హరియాణ, చండీగఢ్‌ ప్రాంతాలను కలిగిన నార్త్‌ జోన్‌కు హెడ్‌గా వ్యహరించారు. దీనికి ముందు అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, మేఘాలయా, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, అండమాన్‌ నికోబార్‌ ప్రాంతాలను కలిగిన తూర్పు జోన్‌కు హెడ్‌గా కొనసాగారు. జీవిత బీమా పరిశ్రమలో ఈయనకు 33 ఏళ్ల అపార అనుభవం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement