సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచుతాం
ఫారిన్ ట్రేడ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అలోక్ త్రివేది
సాక్షి,విశాఖపట్నం: దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచే 45 శాతం జరుగుతున్నాయని, వీటిని మరింత పెంచడమే తమలక్ష్యమని ఫారిన్ ట్రేడ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అలోక్ త్రివేది చెప్పారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల పెంపుదలపై భారత ఎగుమతి దారుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో విశాఖలో మంగళవారం సదస్సు జరిగింది. ఎగుమతి చేయడం ఎలా మొదలుపెట్టాలి, మార్కెట్ రీసెర్చ్, కొనుగోలు దారులను గుర్తించడం వంటి అంశాలను ఆయన వివరించారు.
భారత ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్ స్కీమ్ వివరాలను ఫారెన్ ట్రేడ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పున్నం కుమార్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీని తట్టుకుని నిలబడాలని జాయింట్ డైరెక్టర్ జనరల్ ఉన్ని కృష్ణన్ సూచించారు. ఈ సదస్సులో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ పి.వి.వి.ఎస్.ఎస్. శ్రీనివాస్, బ్యాంకర్లు పాల్గొన్నారు.