ఫైనాన్షియల్ బేసిక్స్..
ఒకే మదుపు లక్ష్యాలున్న ఇన్వెస్టర్ల నుంచి డబ్బు సమీకరించి, ఆ డబ్బును సంబంధిత పత్రాల్లో ఇన్వెస్టర్ల తరపున పెట్టుబడి చేయడం మ్యూచువల్ ఫండ్స్ ప్రధాన విధి. ఇన్వెస్టర్లు నేరుగా చేసే పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా ఇవి ఉపయోగపడతాయి. వేటిలో పెట్టుబడి చేయాలి, ఎంత ధరకు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ధరలో విక్రయించాలి వంటి నిర్ణయాలన్నింటినీ నిపుణుల టీమ్‌తో ఇన్వెస్టర్లకు బదులుగా ఫండ్స్ తీసుకుంటాయి.
ఉదాహరణకు మనం నేరుగా షేర్లలో పెట్టుబడి చేయాలంటే..కంపెనీలను ఎలా ట్రాక్ చేయాలి...ఎలా విశ్లేషించాలి, మార్కెట్ లోతుపాతులేమిటి...అనేవి తెలిసుండాలి. ఈ సమస్యలన్నింటినీ మన నుంచి తప్పించి, మనం డబ్బు ఇస్తే మ్యూచువల్ ఫండ్సే పెట్టుబడులు పెడతాయి.
మ్యూచువల్ ఫండ్‌ను ఒకరు లేదా అంతకంటే వృత్తినిపుణత కలిగిన మేనేజర్లు నిర్వహిస్తారు. ఆ ఫండ్ స్కీము పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఎందులో పెట్టుబడి చేయాలి? వాటిని ఎప్పుడు విక్రయించాలి? అనే నిర్ణయాల్ని రోజువారీగా ఫండ్ మేనేజర్లు తీసుకుంటారు. ప్రతీ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోర్ట్‌ఫోలియో ఆయా ఫండ్ లక్ష్యాలకు అనుగుణంగా వుంటుంది. పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల షేర్లు, బాండ్లు, ఇతర సెక్యూరిటీలు వుంటాయి.
మనం మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి చేసినపుడు ఆ ఫండ్ స్కీముకు సంబంధించి కొన్ని యూనిట్లు వస్తాయి. ప్రతీ యూనిట్ ఆయా ఫండ్ ఫోర్ట్‌ఫోలియోలో ఒక భాగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ పోర్ట్‌ఫోలియో పనితీరు ఆధారంగా మనదగ్గర వున్న యూనిట్ విలువ పెరగడం లేదా తగ్గడం వుంటుంది. ఫండ్‌లో పెట్టుబడి చేసినపుడు, విక్రయించినపుడు, మారినపుడు ఆ యూనిట్‌కున్న నికర ఆస్తి విలువ (ఎన్‌ఏవీ)కు వున్న ధర వర్తిస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి
Published Mon, May 16 2016 3:36 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM
Advertisement