డిజిటల్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ సెకండ్‌ | Hyderabad second place in digital transactions | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ సెకండ్‌

Published Thu, Oct 17 2019 4:47 AM | Last Updated on Thu, Oct 17 2019 4:47 AM

Hyderabad second place in digital transactions - Sakshi

విలేకరుల సమావేశంలో శశాంక్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ లావాదేవీల్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని, రాష్ట్రాల వారీగా జాబితా చూస్తే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో ఉందని రేజర్‌పే సీటీఓ అండ్‌ కో–ఫౌండర్‌ శశాంక్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, పాల్వంచ నుంచి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారమిక్కడ రేజర్‌ పే మూడవ ఎడిషన్‌ నివేదికను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత త్రై మాసికంతో పోలిస్తే హైదరాబాద్‌లో ఈ త్రైమాసికంలో కార్డుల వినియోగం 11 శాతం తగ్గిందని, యూపీఐ లావాదేవీలు 58% వృద్ధి చెందాయని తెలిపారు. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్, యుటిలిటీస్‌ విభాగాలు 51% వాటాను కలిగి ఉందని పేర్కొన్నారు. జొమోటొ, బుక్‌మై షో, ఎయిర్‌టెల్‌ వంటి 6 లక్షల వ్యాపారస్తులు తమ సేవలను వినియోగించుకుంటున్నారని, 2020 నాటికి 10 లక్షలను లకి‡్ష్యంచామని తెలిపారు. బ్యాంక్‌లు, ఫిన్‌టెక్‌ కంపెనీల మధ్య తగినంత సహకారం లేదని, డిజిటల్‌ పేమెంట్స్‌లో రాయితీలు పెంచాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు రేజర్‌పేలో టైగర్‌ గ్లోబల్, మ్యాట్రిక్స్‌ పార్టనర్స్, సికోయా ఇండియా వంటి ఇన్వెస్టర్లు 106.5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement