ఎన్‌ఆర్‌ఐలకు ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త పథకం | ICICI Bank launches new product 'NRI Advantage' , for NRIs | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐలకు ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త పథకం

Published Wed, Sep 24 2014 12:50 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

ఎన్‌ఆర్‌ఐలకు ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త పథకం - Sakshi

ఎన్‌ఆర్‌ఐలకు ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త పథకం

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) ఆర్థికేతర అవసరాలను నెరవేర్చే నిమిత్తం ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ఒక కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. ‘ఎన్‌ఆర్‌ఐ అడ్వాంటేజ్’ పేరుతో ప్రారంభించిన ఈ పథకం వారి ఆరోగ్య సంబంధమైన అలాగే కుటుంబ, స్నేహితుల గిఫ్టింగ్, ఇతర ఇండియన్ బేస్డ్ షాపింగ్ అవసరాలు తీర్చడానికి, ఆయా అంశాల్లో డిస్కౌంట్లకు దోహదపడుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

దాదాపు 150 దేశాల్లోని 15 లక్షల మంది ఎన్‌ఆర్‌ఐలకు కొత్త ప్రొడక్ట్ ద్వారా సేవలు అందించగలుగుతామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సబర్వాల్ తెలి పారు. ఎన్‌ఆర్‌ఐ ప్రైమా, ఎన్‌ఆర్‌ఐ ప్రొ, ఎన్‌ఆర్‌ఐ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను అందించాలన్న లక్ష్యంతో కొత్త ప్రొడక్ట్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. తద్వారా షాపింగ్‌కు సంబంధించి ఎన్‌ఆర్‌ఐలు మరిన్ని ప్రయోజనాలు పొందగలుగుతారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement