సాక్షి, ముంబై: మూడవఅతిపెద్ద ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ క్యూ2 ఫలితాల్లో చతికిలపడింది. లాభాల్లో ఎనలిస్టుల అంచనాలను అందుకోలేకపోయింది. సెప్టెంబరు 30 తో ముగిసిన రెండవ త్రైమాసికంలో నికరలాభం 34శాతం క్షీణించింది. నికర లాభం 2,058 కోట్ల రూపాయలకు పడిపోయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .3,102 కోట్లు.
బ్యాడ్ లోన్ల బెడద బ్యాంక్‌ను పట్టి పీడిస్తోంది. సెప్టెంబరు నెల చివరి నాటికి బ్యాడ్‌లోన్లు మొత్తం రుణాల మొత్తంలో 7.87 శాతంగా ఉన్నాయి. గత జూన్లో 7.99 శాతంగా ఉండగా, ఏడాది క్రితం ఇదే క్వార్టర్‌లో 6.12 శాతంగా ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment