ఫైల్‌ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : వీడియోకాన్ గ్రూప్‌తో కుమ్మక్కై భారీ మొత్తంలో రుణాలు జారీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ ఈ కుంభకోణంపై స్వతంత్ర సంస్థచే విచారణ చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేసింది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి బ్యాంకు అన్నివిధాలా సహకరిస్తుందని, దర్యాప్తు సంస్థ కోరిన లోన్ డాక్యుమెంట్లను అందచేసిందని ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఐసీఐసీఐ బ్యాంకుతో కూడిన 20 బ్యాంకుల కన్సార్షియం వీడియోకాన్ గ్రూప్‌నకు రూ 40,000 కోట్ల రుణాలు మంజూరు చేసింది. వీటిలో చాలావరకూ రుణాలు నిరర్థక ఆస్తులుగా మారాయి. వీడియోకాన్‌కు భారీగా రుణాలు ఇవ్వడంలో ఎలాంటి ప్రలోభాలు జరిగాయనే కోణంలో సీబీఐ విచారణ సాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ల ప్రమేయంపై సీబీఐ ఆరా తీస్తోంది. ప్రాధమిక విచారణలో చందా కొచ్చర్ పేరు లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment