
పరాగ్ అగర్వాల్ ట్విటర్ ఫోటో
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ టాప్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యారు. ఐఐటి-బొంబాయి పూర్వ విద్యార్ధి పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో)గా ఎంపికయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బొంబాయి (ఐఐటీ-బి) పూర్వ విద్యార్ధి పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. 2016 చివరలో రాజీనామా చేసిన అడాం మెసెంజర్ స్థానంలో అగర్వాల్‌ను కొత్తగా నియమించినట్టు ట్విటర్ ప్రకటించింది. సోషల్ మీడియాలో అబ్యూసింగ్ నివారణ, ట్వీట్ల ఔచిత్యాన్ని పెంచడానికి ప్రధాన ప్రయత్నంలో భాగంగా ఎఐ ప్లాట్‌ఫాంపై ఆయన పనిచేయనున్నారని ట్విటర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. సామాజిక నెట్‌వర్క్ దుర్వినియోగాన్ని నివారించడంలో సీటీవోగా అగర్వాల్ దృష్టి పెట్టనున్నారని ట్విటర్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
కాగా 2011లో స్టాన్‌ఫోర్డ్ యూనివర‍్శిటీనుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఈ పదవికి ఎంపిక కాకముందు అగర్వాల్ ఏటి అండ్‌టీ, మైక్రోసాఫ్ట్, యాహూలలో ఇంటర్నషిప్‌గా పరిశోధనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment