న్యూఢిల్లీ: టెక్నాలజీ వినియోగంలో దేశీ కంపెనీలు దూసుకెళుతున్నాయి. ఇప్పటికే 38% భారతీయ కంపెనీలు.. ఉద్యోగులు, మెషీన్లు సమన్వయంతో పనిచేసేలా టెక్నాలజీని వినియోగించుకుంటున్నాయి. ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు సైతం ఈ స్థాయిని అందుకోవడానికి మరో రెండేళ్లు పట్టేయనుంది. డెల్ టెక్నాలజీస్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మిగతా దేశాలతో పోలిస్తే భారత సంస్థలు మరింత పరిణతి చెందాయని డెల్ ప్రెసిడెంట్ రాజేశ్ జానే తెలిపారు.
మనుషులు, మెషీన్లు సమష్టిగా పనిచేసేలా ఇప్పటికే సమన్వయం సాధించినట్లు 38% భారతీయ సంస్థలు వెల్లడించాయని రాజేష్ తెలిపారు. సర్వే నివేదిక ప్రకారం ఉద్యోగులు, యంత్రాల మధ్య సమన్వయం సాధించేందుకు మరో రెండేళ్లు పట్టొచ్చని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల సంస్థలు పేర్కొనగా.. తమకు 2–5 సంవత్సరాలు పట్టొచ్చని చైనా కంపెనీలు వెల్లడించాయి. 12 రంగాలకు సంబంధించి 17 దేశాలకు చెందిన 3,800 మంది వ్యాపార దిగ్గజాలు సర్వేలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment