Dell Technologies
-
ఒక్కరోజులో ఎగిసిన షేర్లు.. 100 బిలియన్ క్లబ్‌లోకి డెల్ సీఈవో
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ (Dell Technologies) సీఈవో మైఖేల్ సాల్ డెల్ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత పరికరాలకు పెరిగిన డిమాండ్‌తో కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆదాయం అమాంతం ఎగిసింది. దీంతో డెల్ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్, సీఈవో అయిన మైఖేల్ డెల్ సంపద శుక్రవారం మొదటిసారిగా 100 బిలియన్ డాలర్ల మార్కును సాధించింది. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో ఒకటైన డెల్ షేర్లు రికార్డు స్థాయికి 32 శాతం జంప్ చేసి, దాని వ్యవస్థాపకుని నెట్‌వర్త్‌ను 13.7 బిలియన్ డాలర్లు పెంచి 104.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.8.6 లక్షల కోట్లు) చేర్చాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం డెల్ ఇప్పుడు భారత్ చెందిన గౌతమ్ అదానీ తర్వాత 12వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. మైఖేల్ డెల్ సంపదలో దాదాపు సగం తన కంప్యూటర్ల తయారీ కంపెనీ నుంచే వచ్చింది. ఆయన 40 సంవత్సరాల క్రితం ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు డెల్ కంపెనీకి ప్రారంభించారు. ఏఐ సంబంధిత స్టాక్‌లలో దూసుకుపోతున్న ర్యాలీ కారణంగా ఈ సంవత్సరం సంపద విపరీతంగా పెరిగిన కొంతమంది బిలియనీర్లలో మైఖేల్ డెల్ కూడా ఒకరు. ఆయన సంపద పెరగడానికి చిప్‌మేకర్ బ్రాడ్‌కామ్ కూడా దోహదపడింది. 2021లో వీఎంవేర్‌ని కొనుగోలు చేసిన తర్వాత డెల్ అందులో వాటాను పొందారు. ఆ షేర్ల విలువ ఇప్పుడు 31 బిలియన్ల డాలర్లుకు పైగా ఉంది. -
డార్మిటరీలో మొదలైన స్టార్టప్.. నేడు 101 బిలియన్ డాలర్ల కంపెనీ
మైఖేల్ డెల్ పేరు చెబితే ఇండియాలో ఎవరూ గుర్తు పట్టరు. ఎందుకంటే బిల్‌గేట్స్, ఈలాన్‌మస్క్, జెప్బేజోస్లాగా వార్తల్లో వ్యక్తి కాదు. కానీ డెల్ కంప్యూటర్స్ అంటే అందరికీ తెలుసు దాన్ని స్థాపించిన వ్యక్తి మైఖేల్ డెల్ అని చెబితేనే అతని గొప్పతనం అర్థం అవుతుంది. అతి తక్కువ పెట్టుబడితో కాలేజ్ డార్మిటరీలో అతను నెలకొల్పిన కంపెనీ ఈ రోజు కోట్లాది మంది ఇంటకి చేరింది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ విద్యార్తిగా ఉన్న రోజుల్లో మైఖేల్ ‘డెల్’ని స్థాపించాడు. కంపెనీ నిర్వహించేందుకు కావాల్సినంత నగదు లేకపోవడంతో ఆస్టిన్ నగరంలో తాను బస చేస్తున్న యూనివర్సిటీ డార్మిటరీలోనే 1984లో డెల్ పురుడుపోసుకుంది. ఆ రోజుల్లో మైఖేల్ పెట్టుబడి కేవలం వెయ్యి డాలర్లు. ఆ డబ్బుతో పాత కంప్యూటర్లను కొని అప్‌గ్రేడ్ చేసి రీసేల్ చేసే పనిని డెల్ నిర్వహించేది. అమెరికాలో 80వ దశకంలోనే కంప్యూటర్ల వినియోగం పెరిగిపోవడంతో కేవలం మూడేళ్లలోనే డెల్ అనూహ్యమైన ప్రగతి సాధించింది. వెయ్యి డాలర్లతో పెట్టిన కంపెనీ 1987 కల్లా 159 మిలియన్ డాలర్ల కంపెనీగా మారింది. 90వ దశకంలో ఇంటర్నెట్ వినియోగం ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. అంతే ఆ తర్వాత డెల్ ప్రపంచమంతటా విస్తరించింది. 2021 చివరి నాటికి 101 బిలియన్ డాలర్ల సంస్థగా డెల్ ఎదిగింది. తాజాగా తన గతాన్ని విజయ ప్రస్థానాన్ని లింక్డ్ఇన్ల్ మైఖేల్డెల్ పంచుకున్నారు. చదవండి: ఫోర్బ్స్ టాప్ 2000లో రిలయన్స్ జోరు.. -
ఏడాదిలో రెట్టింపైన టెలికాం రంగం ఉద్యోగాలు
టెలికాం రంగంలో త్వరలో రాబోయే 5జీ టెక్నాలజీ వల్ల 2020 నాల్గవ త్రైమాసికం, 2021 మొదటి త్రైమాసికంలో ఉద్యోగాల నియామకం రెట్టింపు అయినట్లు డేటా అండ్ ఎనలిటిక్స్ సంస్థ గ్లోబల్‌డేటా తన నివేదికలో వెల్లడించింది. కొత్త తరం టెక్నాలజీ 5జీపై మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు, ప్రభుత్వం ట్రయల్స్, టెస్టింగ్ కోసం అనుమతించినట్లు తెలిపింది. 5జీ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న నెట్వర్క్ ఎలిమెంట్స్‌కి అనుసంధానించాలని కంపెనీలు చూస్తున్నాయి. "2020 నాల్గవ త్రైమాసికంలో, 2021 మొదటి త్రైమాసికంలో మధ్య ఉద్యోగాల నియామకం రెట్టింపు అయ్యాయి. 5జీ డొమైన్లో నైపుణ్యం గల ఇంజనీర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. నెట్‌వర్క్‌లు, ఐపీ నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, ఫర్మ్‌వేర్, ఆటోమేషన్ వంటి రంగాలలో అనుభవం గల ఇంజనీర్లకు డిమాండ్ ఉన్నట్లు" గ్లోబల్‌డేటాలో బిజినెస్ ఫండమెంటల్స్ అనలిస్ట్ అజయ్ తల్లూరి తెలిపారు. టెలిఫోనాక్టిబోలాగేట్ ఎల్ఎమ్ ఎరిక్సన్(ఎరిక్సన్) భారతదేశంలో 2020 జనవరి 1 నుంచి కొత్తగా మరో 20 శాతం ఉద్యోగా నియామకాలను చేపట్టింది. ఎందుకంటే కంపెనీ సెల్యులార్, రేడియో నెట్వర్క్ అవకాశాలను పరిశీలిస్తుంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 5జీ ప్రాజెక్టుల కోసం సిస్కో సిస్టమ్స్ 5 బిలియన్ డాలర్ల(రూ.36,546 కోట్లు)ను పెట్టుబడి పెట్టింది. అందులో భాగంగానే 2020 1 జనవరి నుంచి కంపెనీ భారతదేశంలో మరో 30 శాతానికి కంటే ఎక్కువ శాతం ఉద్యోగ నియామకాలు చేపట్టింది. వర్చువలైజ్డ్ క్లౌడ్ సేవలను ప్రారంభించడానికి సిస్కో క్లౌడ్ కోర్, ప్యాకెట్ కోర్ కోసం ఇంజనీర్లను ఎంచుకుంటుంది. డెల్ టెక్నాలజీస్ (డెల్), క్వాల్కామ్ టెక్నాలజీస్ వంటి 5జీ డొమైన్లో భారీగా ఉద్యోగా నియామకాలు చేపడుతున్నాయి. అందుకే కేవలం ఒక ఏడాదిలో ఈ డొమైన్లో ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయినట్లు గ్లోబల్‌డేటా సంస్థ తన నివేదికలో పేర్కొంది. చదవండి: RockYou2021: ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి -
టెక్నాలజీలో దేశీ సంస్థల దూకుడు
న్యూఢిల్లీ: టెక్నాలజీ వినియోగంలో దేశీ కంపెనీలు దూసుకెళుతున్నాయి. ఇప్పటికే 38% భారతీయ కంపెనీలు.. ఉద్యోగులు, మెషీన్లు సమన్వయంతో పనిచేసేలా టెక్నాలజీని వినియోగించుకుంటున్నాయి. ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు సైతం ఈ స్థాయిని అందుకోవడానికి మరో రెండేళ్లు పట్టేయనుంది. డెల్ టెక్నాలజీస్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మిగతా దేశాలతో పోలిస్తే భారత సంస్థలు మరింత పరిణతి చెందాయని డెల్ ప్రెసిడెంట్ రాజేశ్ జానే తెలిపారు. మనుషులు, మెషీన్లు సమష్టిగా పనిచేసేలా ఇప్పటికే సమన్వయం సాధించినట్లు 38% భారతీయ సంస్థలు వెల్లడించాయని రాజేష్ తెలిపారు. సర్వే నివేదిక ప్రకారం ఉద్యోగులు, యంత్రాల మధ్య సమన్వయం సాధించేందుకు మరో రెండేళ్లు పట్టొచ్చని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల సంస్థలు పేర్కొనగా.. తమకు 2–5 సంవత్సరాలు పట్టొచ్చని చైనా కంపెనీలు వెల్లడించాయి. 12 రంగాలకు సంబంధించి 17 దేశాలకు చెందిన 3,800 మంది వ్యాపార దిగ్గజాలు సర్వేలో పాల్గొన్నారు. -
ఆ ఐటీ కంపెనీలో 2000 ఉద్యోగాలు కట్
కంప్యూటర్ల తయారీలో ప్రపంచపు అగ్రగామి సంస్థ డెల్ టెక్నాలజీస్ రెండు వేల నుంచి మూడు వేల ఉద్యోగాలకు కోత పెట్టనుంది. ప్రపంచ సాంకేతిక రంగంలో అతిపెద్ద విలీనానికి తెరలేపిన డెల్, ఈఎంసీ కార్పొరేషన్‌ను తనలో విలీనం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో వ్యయ భారాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు వేయనుందని కంపెనీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అత్యధిక ఉద్యోగాల కోత అమెరికాలోనూ, సప్లైచైన్, అడ్మిన్‌స్ట్రేషన్, మార్కెటింగ్ ఉద్యోగాల్లో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ కొనుగోలు లావాదేవీ పూర్తైన అనంతరం మొదటి 18 నెలలు 1.7 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించుకోవాలని డెల్ యోచిస్తోంది. ఈ డీల్‌తో ఆ మొత్తానికి అత్యధిక రెట్ల అమ్మకాలు జరపాలని కంపెనీ దృష్టిసారిస్తోంది. ఈ కొత్త కంపెనీలో మొత్తం 140,000 ఉద్యోగులున్నారు. ఈ కామెంట్లపై డెల్ అధికార ప్రతినిధి డేవ్ ఫార్మర్ మాత్రం స్పందించలేదు. ఒప్పందం ప్రకారం ఈఎంసీ కార్పొరేషన్‌ను రూ.4.50 లక్షల కోట్లకు(67 బిలియన్ డాలర్లకు) డెల్ కొనుగోలు చేస్తోంది. కొత్తగా ఏర్పడే సంస్థ తక్షణమే డెల్ టెక్నాలజీస్ పేరుతో కార్యకలాపాలు కొనసాగించనుంది. ఈ విలీనానికి గత జూలైలోనే ఈఎంసీ వాటాదార్లు అంగీకారం తెలిపారు.క్లౌడ్ సర్వీసుల్లో ప్రత్యర్థి కంపెనీలు అమెజాన్.కామ్, మైక్రోసాప్ట్, గూగుల్ వంటి నుంచి వస్తున్న పోటీని తట్టుకుని, విస్తరించే క్రమంలో ఈ రెండు కంపెనీలు జతకట్టి ముందుకు సాగనున్నాయి. ఈఎంసీ కార్పొరేషన్ తమలో విలీనం కానున్నట్టు గతేడాది అక్టోబర్‌లోనే డెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.