న్యూయార్క్:
ఆర్థికాభివృద్ధిలో భారతదేశం ముందజంలోఉందని ఐక్యరాజ్య నిపుణులు తేల్చారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ధాటికి పలు దేశాలు విలవిల్లాడుతోంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని తెలిపింది. 2017-18 సంవత్సరానికి ఇది మరింత మెరుగుపడుతుందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి గరువారం విడుదల చేసిన ఎకానమిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఆసియా అండ్ ఫసిపిక్ - 2016 సర్వే తేల్చింది. దిగివస్తున్న ద్రవ్యోల్బణం, కొన్ని వ్యవస్థాగత చర్యలు భారత్ ను అభివృద్ది వైపు తీసుకెళుతున్నాయని తేల్చింది. ప్రధానంగా 2016-17 లో 7.6 శాతంగా విస్తరించిన ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు 2017-18 లో శాతం 7.8 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.
ఐక్యరాజ్యసమితి ఆర్థిక వ్యవహారాల అధికారి సెబాస్టియన్ వెర్గారా ఈ సర్వేను మీడియాకు విడుదల చేశారు. స్థూల ఆర్థిక విధానం, తగ్గిన ద్రవ్యోల్బణం కొన్ని నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ చెప్పుకోగదగ్గ ఆర్థికాభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. భారత్ అనుసరిస్తున్న ద్రవ్య విధానం మూలంగా ఇటీవలి సంవత్సరాలలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, ఇది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందని తెలిపారు. నిర్మాణాత్మక సంస్కరణలు సంబంధించి దేశంలో భారత ప్రభుత్వం ముఖ్యమైన ప్రయత్నాలు చేసిందనీ పెట్టుబడుల పెరుగుదల పరంగా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చిందన్నారు. ఇటీవలి సంవత్సరాలలో స్థూల ఆర్థిక విధానం ప్రమాదంలో పడిన నేపథ్యంలో ఇది సానుకూల సంకేతమని వ్యాఖ్యానించారు. ఇది వినియోగదారుల సెంటిమెంట్ ను బలపరచడానికి మంచి ప్రణాళికను అందిస్తుందన్నారు. సమీప భవిష్యత్తులోదేశ ఆర్థిక వృద్ధికి ఇది మరింత తోడ్పడతుందని తెలిపారు.
ఆర్థికవృద్దిలో మనమే బెటర్
Published Fri, Apr 29 2016 2:02 PM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM
Advertisement
Advertisement