మరో చౌకైన మొబైల్ @888 | India's cheapest Android phone now costs Rs 888 | Sakshi
Sakshi News home page

మరో చౌకైన మొబైల్ @888

Published Wed, Apr 27 2016 7:58 PM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM

మరో చౌకైన మొబైల్ @888 - Sakshi

మరో చౌకైన మొబైల్ @888

న్యూఢిల్లీ: రింగింగ్ బెల్స్, దేశంలోనే అత్యంత చవకైన ఫోన్ ను తయారుచేసి 251 రూపాయలకే అందిస్తామని చెప్పి చేతులెత్తేసిన విషయం తెలిసిందే. తాజాగా 'డొకోస్' అనే సంస్థ 888 రూపాయలకు స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని ప్రకటించింది.

పెద్ద ఆర్భాటమేమీ లేకుండా ప్రారంభోత్సవం చేసుకున్న ఈ సంస్థ తన మొదటి మోడల్ పేరును 'డొకోస్ ఎక్స్ 1' గా ప్రకటించింది. తన వెబ్ సైట్ ద్వారా ఫోన్లను అమ్మకానికి పెట్టేసింది. మే 2లోగా ఫోన్లను అందిస్తామని .. క్యాష్ ఆన్ డెలివరీ విధానం కూడా అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.

కొనుగోలుదారులు ఎస్ఎంఎస్ ద్వారా ఫోన్ బుక్ చేసుకోవాలని కోరుతూ వెబ్ సైట్లో వివరాలను పెట్టింది. అయితే, మొబైల్ ఎలా ఉంటుందనే వివరాలను గానీ, ఫోన్ ఫీచర్స్ గానీ వెల్లడించలేదు. సంస్థను గురించి కొద్దిపాటి వివరాలను మాత్రమే అందుబాటులో ఉంచిన డొకోస్ .. సెల్ కొనుగోలు కోసం కాల్ చేయొద్దని కేవలం ఎస్ఎంఎస్ మాత్రమే చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరింది.
 

  • RAM : 1 GB
  • 2.0 MP Primary Camera
  • 0.3 MP Secondary Camera
  • 1300 mAh Long Lasting Battery
  • 1.2GHz, Dual-Core Cortex A7
  • 4G LTE
  • 4 inch IPS screen
  • Android 4.4.2 (Kikat) OS
  • Dual Sim (GSM + WCDMA)
  • Expandable Storage Capacity of 32 GB

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement