వృద్ధి ఎనిమిది శాతం పైనే..!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది శాతం దాటుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా అభిప్రాయపడ్డారు. తగిన వర్షపాతం నమోదయ్యే అవకాశాలు, తయారీ రంగం పురోగమనం భారీ వృద్ధికి సహకరిస్తాయన్న అభిప్రాయాన్ని పనగారియా వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 4 శాతం నుంచి 5 శాతం శ్రేణిలో నమోదవుతుందన్నది తమ అంచనా అని తెలిపారు.