రెండు రెట్లకు మించిన ఇండిగో లాభం | Indigo Profits in this Fiscal Year | Sakshi
Sakshi News home page

రెండు రెట్లకు మించిన ఇండిగో లాభం

Published Tue, Jan 28 2020 8:05 AM | Last Updated on Tue, Jan 28 2020 8:05 AM

Indigo Profits in this Fiscal Year - Sakshi

ముంబై: ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్‌ క్వార్టర్లో రెండు రెట్లకు మించి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.185 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.496 కోట్లకు పెరిగిందని ఇండిగో సీఈఓ రనోజాయ్‌ దత్తా తెలిపారు.  మొత్తం ఆదాయం రూ.8,229 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.10,330 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.  

నెట్‌వర్క్‌ విస్తరణ..: టికెట్ల ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,770 కోట్లకు, అనుబంధ ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.1,037 కోట్లకు పెరిగాయని దత్తా తెలిపారు. గత క్యూ3లో కిమీకు. రూ.3.83గా ఉన్న సగటు టికెట్‌ ధర ఈ క్యూ3లో రూ.3.88కు పెరిగిందని వివరించారు. ఇంధన వ్యయాలు రూ.341 కోట్ల నుంచి 2 శాతం క్షీణించి రూ.334 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. షిర్డి, షిల్లాంగ్‌ వంటి చిన్న నగరాలకు, హనోయ్, గాంగ్జూ వంటి విదేశీ నగరాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement