
న్యూఢిల్లీ: ఇండస్‌ఇండ్ బ్యాంక్ తన కస్టమర్లకు త్వరలో వాట్సాప్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం పైలట్ ప్రాజెక్టు కింద వాట్సాప్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్‌ను ఆవిష్కరించింది. దీనిసాయంతో కస్టమర్లు లావాదేవీలను వాట్సాప్‌లో చూసుకోవచ్చు. అలాగే బ్యాంక్ అధికారులతో సంభాషణలు నిర్వహించొచ్చు. వాట్సాప్‌లో మెసేజ్ సర్వీసును కస్టమర్లకు దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తామని బ్యాంక్ తెలిపింది.
బ్యాంక్ అధికారిక వాట్సాప్ నంబర్‌ను ఖాతాదారులు స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకొని, సంభాషణను ప్రారంభించొచ్చని పేర్కొంది. కస్టమర్లు వాట్సాప్ ద్వారా రెండు రకాల సేవలు పొందొచ్చని తెలిపింది. కస్టమర్ మెసేజ్‌కు రిప్లే ఇవ్వడం మొదటిది. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్‌మెంట్, రివార్డ్ పాయింట్స్ చెకింగ్, ఆధార్ అప్‌డేట్ వంటి బేసిక్ సర్వీసులు రెండోది.
Comments
Please login to add a commentAdd a comment