3 రోజుల్లో 15 వేల విక్రయాలు
న్యూఢిల్లీ: ఇంటెక్స్ సంస్థ మూడు రోజుల్లో 15 వేల ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. రూ.1,999 ధర ఉన్న ఈ క్లౌడ్ ఎఫ్‌ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను గత 25న స్నాప్‌డీల్ ద్వారా మార్కెట్లోకి తెచ్చామని ఇంటెక్స్ తెలిపింది. భారత్‌లో లభ్యమవుతున్న అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్ ఇదేనని పేర్కొంది. అధిక అమ్మకాలు దక్షిణ భారత నగరం నుంచే జరిగాయని వివరించింది,18-25 సంవత్సరాల వయస్కులు అధికంగా ఈ ఫోన్లను కొనుగోలు చేశారని పేర్కొంది.
ఈ నెలాఖరు కల్లా లక్ష ఫోన్‌లను విక్రయించగలమని, ఈ ఏడాది చివరి కల్లా ఐదు లక్షల ఫోన్‌లను విక్రయించడం లక్ష్యమని వివరించింది. ఈ కంపెనీ ఇటీవలనే బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించడానికి అనుష్క శెట్టి, సుదీప్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను నిర్వహించే సాఫ్ట్‌వేర్ దిగ్గజం మోజిల్లా 25 డాలర్ల ధర ఉండే స్మార్ట్‌ఫోన్ ప్రొటొటైప్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసింది.
ఈ ఫోన్ల తయారీ కోసం ఇంటెక్స్, స్పైస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ను ఇంటెక్స్ సంస్థ క్లౌడ్ ఎఫ్‌ఎక్స్ పేరుతోనూ, స్పైస్ కంపెనీ ఫైర్ వన్ మి ఎఫ్‌ఎక్స్ 1(ధర రూ. 2,299) పేరుతోనూ అందిస్తున్నాయి. ఇక ఇంటెక్స్ రూపొందించిన క్లౌడ్ ఎఫ్‌ఎక్స్‌లో 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్క్రీన్, డ్యుయల్ సిమ్, 1 గిగా హెట్జ్ ప్రాసెసర్, 128 ఎంబీ ర్యామ్, 256 ఎంబీ మెమెరీ, 4 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 1,250 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.