
హైదరాబాద్‌లో రేపు సాక్షి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు
సాక్షి, హైదరాబాద్ : వ్యక్తిగత పొదుపు పథకాలతో పాటు ఆర్థిక అంశాలపై మదుపరులకు అవగాహన కల్పించడానికి ‘సాక్షి’ ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు శనివారం కూకట్‌పల్లిలో జరగనుంది. ఇప్పటిదాకా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాక్షి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సులు నిర్వహించగా పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు హాజరై... వివిధ ఆర్థిక అంశాలు, షేర్లు, పథకాలకు సంబంధించి తమ సందేహాలను నిపుణుల ద్వారా తీర్చుకున్నారు.
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ సదస్సు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జేఎన్‌టీయూలోని యూజీసీ-ఏఎస్‌సీ ఆడిటోరియంలో జరగనుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచ్‌వల్ ఫండ్‌తో కలిసి ‘సాక్షి’ నిర్వహిస్తున్న ఈ సదస్సులో వివిధ ఆర్థిక సంస్థలకు చెందిన నిపుణులు పాల్గొని ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలిస్తారు. దీనికి ఎవరైనా హాజరుకావచ్చు. ఉచిత సభ్యత్వ నమోదు కోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 9505555020 నంబరుకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.