హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నీరు, పర్యావరణ నిర్వహణ కంపెనీ అయాన్ ఎక్సే్చంజ్... ఆండికోస్ టెక్నాలజీ ఆధారిత వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసింది. రూ.7 కోట్లతో అక్షయపాత్ర కేంద్రంలో దీనిని నిర్మించింది. బెల్జియంకు చెందిన విటో, యూరోపెమ్ కంపెనీల సాయంతో ఆండికోస్ కాన్సెప్ట్, టెక్నాలజీ రూపుదిద్దుకుందని అయాన్ ఎక్సే్చంజ్ ఇండియా ప్రెసిడెంట్ అజయ్ పోపట్ గురువారమిక్కడ మీడియాకు చెప్పారు.
ఈ ప్లాంటు ద్వారా మురుగు నుంచి స్వచ్ఛమైన నీరు, ఆహార వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. అలాగే విద్యుత్ కూడా ఉత్పత్తవుతుంది. 3–5 ఏళ్లలో పెట్టుబడి రికవరీ అవుతుందని వెల్లడించారు. కంపెనీలు, సంస్థలు కోరితే బిల్ట్, ఆపరేట్, ఓన్ ప్రాతిపదికన ఇటువంటి ప్లాంట్ల ఏర్పాటుకు తాము సిద్ధమని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment