
బెంగళూరులో ఐఫోన్ల తయారీ!
బెంగళూరు: యాపిల్ కంపెనీ భారత్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులో తమ ఐఫోన్లను తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. యాపిల్ కోసం ఫోన్లు తయారు చేసే తైవాన్ కంపెనీ విస్ట్రాన్ వీటిని ఉత్పత్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం బెంగళూరులోని పీన్యాలో విస్ట్రాన్ ఐఫోన్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వివరించాయి.