ఐటీ పనితీరు అంతంతే! | IT companies likely to post muted growth in Q1 due to wage hikes | Sakshi
Sakshi News home page

ఐటీ పనితీరు అంతంతే!

Published Mon, Jul 10 2017 1:37 AM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

ఐటీ పనితీరు అంతంతే!

ఐటీ పనితీరు అంతంతే!

క్యూ1లో మార్జిన్లు తగ్గే అవకాశం...
రూపాయి బలం, వేతనాల పెంపు ప్రభావం: విశ్లేషకులు
13 నుంచి కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు షురూ


న్యూఢిల్లీ: కఠిన వీసా నిబంధనలు, బ్రెగ్జిట్‌(యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం) ఇతరత్రా సమస్యల్లో చిక్కుకున్న దేశీ ఐటీ కంపెనీల ఆర్థిక పనితీరు అంతంతమాత్రంగానే ఉండొచ్చని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2017–18, క్యూ1)లో ఐటీ సంస్థల మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని, దీనివల్ల లాభాలు తగ్గుముఖం పట్టొచ్చని పేర్కొంటున్నారు.  డాలరుతో రూపాయి మారకం విలువ పెరుగుదల(ప్రస్తుతం 64.5 స్థాయిలోఉంది), వేతనాల పెంపు వంటివి కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపనున్నాయని చెబుతున్నారు. ఈ నెల 13(గురువారం) దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్‌తో ఆర్థిక ఫలితాల సీజన్‌ ప్రారంభం కానుంది. 14న(శుక్రవారం) నంబర్‌–2 కంపెనీ ఇన్ఫోసిస్, 20న నంబర్‌–3 సంస్థ విప్రో ఫలితాలను ప్రకటించనున్నాయి.

డీల్స్‌ మందగమనం..: సీజనల్‌గా పటిష్టమైన త్రైమాసికంగా భావించే క్యూ1లో ప్రధాన ఐటీ కంపెనీల ఆదాయ, లాభాల్లో చెప్పుకోదగ్గ వృద్ధికి ఆస్కారం లేదని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ నివేదికలో పేర్కొంది. ‘ఫైనాన్షియల్‌ సేవల రంగం నుంచి ఆర్డర్ల దన్ను అనుకున్నంతగా లేకపోవడం, పెద్ద కాంట్రాక్టులను వేగంగా ముగించలేకపోవడం వంటివి కంపెనీల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అదేవిధంగా రూపాయి విలువ పెరుగుదల, వేతనాల పెంపు కూడా మారిన్లులో తగ్గుదలకు దారితీసే అంశాలు’ అని కోటక్‌ వివరించింది.

3.9 శాతం పెరిగిన రూపాయి...
ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 3.9% మేర ఎగబాకిందని ఎడెల్‌వీస్‌ వెల్లడించింది. అధిక వీసా వ్యయాలు, వేతన పెంపు కూడా మార్జిన్ల తగ్గేందుకు కారణమవుతాయని పేర్కొంది. ‘డాలరుతో పోలిస్తే బ్రిటన్‌ పౌండ్, జపాన్‌ యెన్, యూరో కరెన్సీలు బలపడుతున్నాయి. మన ఐటీ కంపెనీలకు ఈ క్రాస్‌ కరెన్సీ సమస్యల కారణంగా మార్జిన్లపై 40–90 బేసిస్‌ పాయింట్లు(0.4–0.9%) కోతకు ఆస్కారం ఉంది. క్యూ1లో టాప్‌–5 ఐటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ల డాలరు ఆదాయాల్లో సీక్వెన్షియల్‌గా(క్రితం క్వార్టర్‌తో పోలిస్తే) 1–4.2 శాతం వృద్ధి ఉండొచ్చు’ అని ఎడెల్‌వీస్‌ తెలిపింది.

జోరు తగ్గిన ఫైనాన్షియల్‌ సేవలు...
ప్రధానంగా ఐటీ రంగం ఆదా యాలకు దన్నుగా నిలుస్తున్న ఫైనాని ్షయల్‌ సేవల రంగంలో తగినంత జోరు లేకపోవడం మన సాఫ్ట్‌వేర్‌ కంపెనీల బలహీన వృద్ధికి కారణమవుతోందని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా కొత్త డీల్స్‌లో పెద్దగా పెరుగుదల లేకపోవడం కూడా మందగమనాని కి కారణంగా చెబుతున్నారు. అమెరికాతో పాటు సింగపూర్, ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్‌ తదితర దేశాల్లో వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో భారత్‌ ఐటీ రంగం ఇటీవలి కాలం లో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొం టున్న సంగతి తెలిసిందే.

ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో దిగ్గజాలతోసహా అనేక కంపెనీలు భారీగా ఉద్యోగులను కూడా తొలగించేందు కు దారితీస్తోంది. ఏటా జరిపే విధంగా ఏప్రిల్‌ నుంచి వేతనాల పెంపును అమలు చేయడానికి బదులు కొన్ని కంపెనీలు దీన్ని వాయిదా వేశాయి కూడా. మరోపక్క, అమెరికా కఠిన వీసా నిబంధనలతో కంపెనీలు అక్క డి స్థానికులకు ఉద్యోగాలివ్వాల్సిన పరిస్థితి. వచ్చే రెండేళ్లలో 10 వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలిస్తామని ఇన్ఫోసిస్‌ ప్రకటించగా.. టీసీ ఎస్, విప్రో కూడా ఇలాంటి చర్యలను చేపట్టాయి. ఈ పరిణామాలు మన ఐటీ సంస్థల వ్యయాలను మరింత పెంచనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement