Q 1
-
ఐటీ పనితీరు అంతంతే!
♦ క్యూ1లో మార్జిన్లు తగ్గే అవకాశం... ♦ రూపాయి బలం, వేతనాల పెంపు ప్రభావం: విశ్లేషకులు ♦ 13 నుంచి కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు షురూ న్యూఢిల్లీ: కఠిన వీసా నిబంధనలు, బ్రెగ్జిట్(యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం) ఇతరత్రా సమస్యల్లో చిక్కుకున్న దేశీ ఐటీ కంపెనీల ఆర్థిక పనితీరు అంతంతమాత్రంగానే ఉండొచ్చని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2017–18, క్యూ1)లో ఐటీ సంస్థల మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని, దీనివల్ల లాభాలు తగ్గుముఖం పట్టొచ్చని పేర్కొంటున్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ పెరుగుదల(ప్రస్తుతం 64.5 స్థాయిలోఉంది), వేతనాల పెంపు వంటివి కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపనున్నాయని చెబుతున్నారు. ఈ నెల 13(గురువారం) దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్‌తో ఆర్థిక ఫలితాల సీజన్ ప్రారంభం కానుంది. 14న(శుక్రవారం) నంబర్–2 కంపెనీ ఇన్ఫోసిస్, 20న నంబర్–3 సంస్థ విప్రో ఫలితాలను ప్రకటించనున్నాయి. డీల్స్ మందగమనం..: సీజనల్‌గా పటిష్టమైన త్రైమాసికంగా భావించే క్యూ1లో ప్రధాన ఐటీ కంపెనీల ఆదాయ, లాభాల్లో చెప్పుకోదగ్గ వృద్ధికి ఆస్కారం లేదని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదికలో పేర్కొంది. ‘ఫైనాన్షియల్ సేవల రంగం నుంచి ఆర్డర్ల దన్ను అనుకున్నంతగా లేకపోవడం, పెద్ద కాంట్రాక్టులను వేగంగా ముగించలేకపోవడం వంటివి కంపెనీల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అదేవిధంగా రూపాయి విలువ పెరుగుదల, వేతనాల పెంపు కూడా మారిన్లులో తగ్గుదలకు దారితీసే అంశాలు’ అని కోటక్ వివరించింది. 3.9 శాతం పెరిగిన రూపాయి... ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 3.9% మేర ఎగబాకిందని ఎడెల్వీస్ వెల్లడించింది. అధిక వీసా వ్యయాలు, వేతన పెంపు కూడా మార్జిన్ల తగ్గేందుకు కారణమవుతాయని పేర్కొంది. ‘డాలరుతో పోలిస్తే బ్రిటన్ పౌండ్, జపాన్ యెన్, యూరో కరెన్సీలు బలపడుతున్నాయి. మన ఐటీ కంపెనీలకు ఈ క్రాస్ కరెన్సీ సమస్యల కారణంగా మార్జిన్లపై 40–90 బేసిస్ పాయింట్లు(0.4–0.9%) కోతకు ఆస్కారం ఉంది. క్యూ1లో టాప్–5 ఐటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ల డాలరు ఆదాయాల్లో సీక్వెన్షియల్‌గా(క్రితం క్వార్టర్‌తో పోలిస్తే) 1–4.2 శాతం వృద్ధి ఉండొచ్చు’ అని ఎడెల్వీస్ తెలిపింది. జోరు తగ్గిన ఫైనాన్షియల్ సేవలు... ప్రధానంగా ఐటీ రంగం ఆదా యాలకు దన్నుగా నిలుస్తున్న ఫైనాని ్షయల్ సేవల రంగంలో తగినంత జోరు లేకపోవడం మన సాఫ్ట్వేర్ కంపెనీల బలహీన వృద్ధికి కారణమవుతోందని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా కొత్త డీల్స్‌లో పెద్దగా పెరుగుదల లేకపోవడం కూడా మందగమనాని కి కారణంగా చెబుతున్నారు. అమెరికాతో పాటు సింగపూర్, ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో భారత్ ఐటీ రంగం ఇటీవలి కాలం లో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొం టున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో దిగ్గజాలతోసహా అనేక కంపెనీలు భారీగా ఉద్యోగులను కూడా తొలగించేందు కు దారితీస్తోంది. ఏటా జరిపే విధంగా ఏప్రిల్ నుంచి వేతనాల పెంపును అమలు చేయడానికి బదులు కొన్ని కంపెనీలు దీన్ని వాయిదా వేశాయి కూడా. మరోపక్క, అమెరికా కఠిన వీసా నిబంధనలతో కంపెనీలు అక్క డి స్థానికులకు ఉద్యోగాలివ్వాల్సిన పరిస్థితి. వచ్చే రెండేళ్లలో 10 వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలిస్తామని ఇన్ఫోసిస్ ప్రకటించగా.. టీసీ ఎస్, విప్రో కూడా ఇలాంటి చర్యలను చేపట్టాయి. ఈ పరిణామాలు మన ఐటీ సంస్థల వ్యయాలను మరింత పెంచనుంది. -
ఐసీఐసీఐ లాభం 25% డౌన్
♦ క్యూ1లో రూ. 2,232 కోట్లు... ♦ ఆదాయం రూ.16,760 కోట్లు; 6 శాతం వృద్ధి ♦ 5.87 శాతానికి ఎగబాకిన మొండిబకాయిలు న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకును మొండిబకాయిలు(ఎన్పీఏ) వెంటాడుతూనే ఉన్నాయి. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో బ్యాంక్ స్టాండెలోన్(ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి) నికర లాభం 25 శాతం దిగజారి రూ. 2,232 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ. 2,976 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఎన్పీఏలు భారీగా ఎగబాకడంతో కేటాయింపుల(ప్రొవిజనింగ్) భారం పెరగడం... లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇక మొత్తం ఆదాయం క్యూ1లో రూ.16,760 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే క్వార్టర్లో లాభం రూ. 15,802 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి చెందింది. కాగా, బీమా అనుబంధ సంస్థలో వాటా విక్రయం ద్వారా రూ.617 కోట్లమేరకు అదనపు రాబడి లాభాలకు కొంత దన్నుగా నిలిచింది. ఎన్పీఏలు పైపైకి... బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు జూన్ క్వార్టర్ నాటికి 5.87 శాతానికి(రూ.27,194 కోట్లు) పెరిగిపోయాయి. క్రితం ఏడాది క్యూ1లో స్థూల ఎన్పీఏలు 3.68 శాతం(రూ.15,138 కోట్లు) కాగా, మార్చి క్వార్టర్‌కు 5.82 శాతం(రూ.26,221 కోట్లు)గా నమోదయ్యాయి. ఇక నికర ఎన్పీఏల విషయానికొస్తే.. గతేడాది జూన్ చివరినాటికి 1.58 శాతం(రూ.6,333 కోట్లు) కాగా, ఈ ఏడాది జూన్ నాటికి 3.35 శాతానికి(రూ.15,041 కోట్లు) ఎగబాకాయి. మార్చి క్వార్టర్ నాటికి నికర ఎన్పీఏలు 2.98 శాతం(రూ.12,963 కోట్లు)గా ఉన్నాయి. ఇక ఎన్పీఏలకు మొత్తం కేటాయింపులు గతేడాది జూన్ క్వార్టర్లో రూ.956 కోట్లతో పోలిస్తే ఈ క్యూ1లో మూడింతలు ఎగబాకి రూ.2,515 కోట్లకు చేరాయి. క్యూ1లో పునర్వ్యవస్థీకరించిన కార్పొరేట్ రుణాలు రూ.7,241 కోట్లుగా నమోదయ్యాయి. మార్చి క్వార్టర్(క్యూ4)లో ఈ మొత్తం విలువ రూ.8,573 కోట్లుగా ఉంది. కాగా, మొండిబకాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూ.3,600 కోట్ల రిజర్వు నిధి నుంచి క్యూ1లో రూ.865 కోట్లను ప్రొవిజనింగ్ కోసం బ్యాంక్ వినియోగించుకుంది. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ)లకు రూ.2,232 కోట్ల విలువైన రుణాలను విక్రయించింది. కన్సాలిడేటెడ్‌గా చూస్తే... బీమా వ్యాపారం, మ్యూచువల్ ఫండ్ ఇతరత్రా అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి చూస్తే(కన్సాలిడేటెడ్) ఐసీఐసీఐ నికర లాభం క్యూ1లో రూ. 2,516 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,232 కోట్లతో పోలిస్తే 22.1 శాతం దిగజారింది. మొత్తం ఆదాయం రూ.22,456 కోట్ల నుంచి రూ.24,483 కోట్లకు పెరిగింది. 9 శాతం వృద్ధి నమోదైంది. ఇతర ముఖ్యాంశాలివీ.. ⇔ క్యూ1లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ)లో వృద్ధి నమోదుకాలేదు. రూ.5,115 కోట్ల నుంచి రూ.5,159 కోట్లకు చేరింది. ⇔ వడ్డీయేతర ఇతర ఆదాయం 15 శాతం వృద్ధితో రూ. 2,990 కోట్ల నుంచి రూ.3,429 కోట్లకు పెరిగింది. ⇔ రిటైల్ రుణాల్లో 22 శాతం భారీ వృద్ధి నేపథ్యంలో జూన్ క్వార్టర్లో మొత్తం రుణ వృద్ధి 12.5 శాతంగా నమోదైంది. ⇔ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం రూ.116 కోట్ల నుంచి రూ.131 కోట్లకు పెరిగింది. 13 శాతం వృద్ధి చెందింది. ⇔ ఇక మరో సబ్సిడరీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ.397 కోట్ల నుంచి రూ.405 కోట్లకు చేరింది. పబ్లిక్ ఆఫర్ కోసం సంస్థ ఇటీవలే సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ⇔ ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 3.4 శాతం క్షీణించి రూ.263 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. కాగా, అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలో ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్ కడపటి సమాచారం మేరకు 6 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ‘జూన్ క్వార్టర్లో కొత్తగా రూ.8,249 కోట్లు మొండిబకాయిల్లోకి చేరాయి. ప్రధానంగా ప్రత్యేక పరిశీలనలో ఉంచిన ఖాతాల నుంచి ఇందులో 76 శాతం నమోదైంది. ఈ జాబితాలో మార్చి 30 నాటికి రూ.44,000 కోట్ల విలువైన రుణాలను చేర్చాం. ప్రస్తుతం ఈ మొత్తం రూ.38,723 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొండిబకాయిల్లో 30 శాతం మేర మళ్లీ గాడిలోకి వస్తాయని భావిస్తున్నాం. అయితే, దేశీయంగా ఆర్థిక రికవరీ నెమ్మదిగానే జరుగుతుండటం, బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కమోడిటీ ధరల తగ్గుదల వంటి పరిణామాల నేపథ్యంలో కొన్ని రంగాల్లో అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే, ఎన్పీఏలకు అడ్డుకట్టపడకపోవడంతో మార్జిన్లపై ఒత్తిడి కొనసాగవచ్చు. ప్రస్తుతానికి కాస్త సురక్షితంగా కనబడుతున్న రిటైల్ రుణాలపైనే అధికంగా దృష్టిసారిస్తున్నాం. ఈ ఏడాది దేశీ రుణాల్లో 18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ -
హెచ్డీఎఫ్సీ, యస్ బ్యాంక్ భారీ ముందస్తు పన్నులు
ముంబై: హెచ్డీఎఫ్సీ, యస్ బ్యాంక్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో (ఏప్రిల్-జూన్) భారీగా ముందస్తు పన్ను (ఏటీ) చెల్లించినట్లు తెలిపాయి. 2014 ఇదే కాలంతో పోల్చితే ఈ మొత్తం 12 శాతం వృద్ధితో రూ.415 కోట్ల నుంచి రూ.465 కోట్లకు పెరిగినట్లు హెచ్డీఎఫ్సీ తెలిపింది. ఇక యస్ బ్యాంక్ అడ్వాన్స్ ట్యాక్స్ 36% వృద్ధితో రూ.125 కోట్ల నుంచి రూ.170 కోట్లకు పెరిగింది. క్యూ1లో ఎస్బీఐ ఏటీ చెల్లింపు 4 శాతం పెరిగింది. రూ.1,290 కోట్లను చెల్లించింది. కాగా ఆర్థిక రాజధానిలో ముంబైలోని పలు కంపెనీలు ఇప్పటి వరకూ చెల్లించిన ముందస్తు పన్ను వివరాలను ముంబై ఆదాయపు పన్ను అధికారులు వెల్లడించలేదు. ఒక నిర్దిష్ట ఏడాదిలో ఆర్థిక స్థితిగతులను ముందస్తుగానే అంచనాకట్టి, దీనిపై చెల్లించాల్సిన ఆదాయపు పన్నును ఆర్థిక సంవత్సరంలో నాలుగు విడతలుగా ముందస్తుగానే చెల్లించే విధానమే... అడ్వాన్స్ ట్యాక్స్.