హెచ్‌డీఎఫ్‌సీ, యస్ బ్యాంక్ భారీ ముందస్తు పన్నులు
ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ, యస్ బ్యాంక్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో (ఏప్రిల్-జూన్) భారీగా ముందస్తు పన్ను (ఏటీ) చెల్లించినట్లు తెలిపాయి. 2014 ఇదే కాలంతో పోల్చితే ఈ మొత్తం 12 శాతం వృద్ధితో రూ.415 కోట్ల నుంచి రూ.465 కోట్లకు పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. ఇక యస్ బ్యాంక్ అడ్వాన్స్ ట్యాక్స్ 36% వృద్ధితో రూ.125 కోట్ల నుంచి రూ.170 కోట్లకు పెరిగింది. క్యూ1లో ఎస్‌బీఐ ఏటీ చెల్లింపు 4 శాతం పెరిగింది. రూ.1,290 కోట్లను చెల్లించింది. కాగా ఆర్థిక రాజధానిలో ముంబైలోని పలు కంపెనీలు ఇప్పటి వరకూ చెల్లించిన ముందస్తు పన్ను వివరాలను ముంబై ఆదాయపు పన్ను అధికారులు వెల్లడించలేదు. ఒక నిర్దిష్ట ఏడాదిలో ఆర్థిక స్థితిగతులను ముందస్తుగానే అంచనాకట్టి, దీనిపై చెల్లించాల్సిన ఆదాయపు పన్నును ఆర్థిక సంవత్సరంలో నాలుగు విడతలుగా ముందస్తుగానే చెల్లించే విధానమే... అడ్వాన్స్ ట్యాక్స్.