
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు వ్యాపార సులభతర దేశాల జాబితాలో టాప్–50లోకి చేరడం సాధ్యమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ప్రపంచబ్యాంకు ర్యాంకుల్లో భారత్ గతేడాది 100వ ర్యాంకు నుంచి ఈ ఏడాది 77వ స్థానానికి చేరుకున్న నేపథ్యంలో జైట్లీ తన స్పందనను ఓ బ్లాగులో తెలియజేశారు.
టాప్–50లోకి చేరడానికి భారత్ 27 స్థానాల దూరంలో ఉన్నట్టు చెప్పారు. అసాధ్యంగా అనిపించేది, ఇప్పుడు సాధ్యమేనని చెప్పారాయన. ‘‘మోదీ సర్కారు హయాంలో మన దేశం 65 స్థానాలు ముందుకు వచ్చింది.’’ అని అరుణ్ జైట్లీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment