రూ.64,564 కోట్లకు జన్‌ధన్‌ డిపాజిట్లు | Jan Dhan deposits surge to Rs 64564 crore | Sakshi
Sakshi News home page

రూ.64,564 కోట్లకు జన్‌ధన్‌ డిపాజిట్లు

Published Mon, Jul 17 2017 1:32 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

రూ.64,564 కోట్లకు జన్‌ధన్‌ డిపాజిట్లు - Sakshi

రూ.64,564 కోట్లకు జన్‌ధన్‌ డిపాజిట్లు

న్యూఢిల్లీ: సామాన్యుల కోసం మోదీ సర్కారు ప్రవేశపెట్టిన జన్‌ధన్‌ పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రూ.64,564కోట్లకు చేరాయి. ఈ పథకం కింద జీరో బ్యాలన్స్‌ సదుపాయంతో ఖాతాలు తెరిచి నిర్వహించుకోవచ్చు. ఈ ఏడాది జూన్‌ 14 నాటికి జన్‌ధన్‌ ఖాతాల సంఖ్య 28.9 కోట్లు.

వీటిలో 23.27  కోట్లు ప్రభుత్వ బ్యాంకుల్లోవి కాగా, 4.7 కోట్లు గ్రామీణ బ్యాంకుల్లో, 92.7 లక్షల ఖాతాలు ప్రైవేటు బ్యాంకుల్లోనివి. ఈ మొత్తం ఖాతాల్లో నగదు నిల్వలు రూ.64,564 కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేసే నాటికి ఈ ఖాతాల్లోని డిపాజిట్లు రూ.64,252 కోట్లుగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనం మార్పిడికి జన్‌ధన్‌ ఖాతాలను ఉపయోగిస్తున్నారన్న ప్రచారం జరగ్గా ప్రభుత్వం హెచ్చరించడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement