Cash reserves
-
కార్పొరేట్ ఇండియా... డివిడెండ్ బొనాంజా!
ఇటీవల నగదు నిల్వలు అధికంగా గల(క్యాష్ రిచ్) కంపెనీలు వాటాదారులకు డివిడెండ్లు, బైబ్యాక్‌ల రూపంలో లాభాలను పంచేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు విస్తరణ ప్రాజెక్టుల వ్యయాలు తగ్గడం, వ్యాపార నిర్వహణ ద్వారా మెరుగుపడుతున్న క్యాష్‌ఫ్లో తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వార్షిక లాభాల్లో 90 శాతం వరకూ డివిడెండుగా అందించనున్నట్లు ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో ప్రకటించడాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. వెరసి ఇకపై మరిన్ని కంపెనీలు ఈ బాటలో నడిచే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. ముంబై: కొద్ది రోజులుగా దేశీ బ్లూచిప్ కంపెనీల వద్ద నగదు నిల్వలు పెరుగుతూ వస్తున్నాయి. బ్యాంకులు, బీమా, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను మినహాయిస్తే.. పలు లిస్టెడ్ కంపెనీల వద్ద నగదు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఒక అంచనా ప్రకారం 2020 మార్చికల్లా టాప్ లిస్టెడ్ కంపెనీల వద్ద రూ. 11 లక్షల కోట్లకుపైగా నగదు, తత్సమాన నిల్వలున్నాయి. ఇవి ఆయా కంపెనీల మొత్తం నెట్‌వర్త్‌లో 30 శాతానికి సమానమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా లాభాల్లో 90 శాతం వరకూ డివిడెండ్లకు కేటాయించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇటీవల కాలంలో చెల్లించిన డివిడెండ్లతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో వాటాదారులకు భారీ నగదు అందనున్నట్లు నిపుణులు తెలియజేశారు. బజాజ్ ఆటో కొత్త డివిడెండ్ పాలసీ నేపథ్యం లో ఇకపై మరిన్ని కార్పొరేట్స్ ఈ బాటలో నడిచే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు గత వారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ డివిడెండ్ పంపిణీ పాలసీని సమీక్షించింది. దీనిలో భాగంగా మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా డివిడెండ్ పాలసీలోకి వచ్చే టాప్–500 కంపెనీల జాబితాను టాప్–1,000కు సవరించింది. ఇది డివిడెండ్ చెల్లింపు విధానాలలో మార్పులకు కారణంకానున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బజాజ్ దూకుడు... గత మూడేళ్లలో బజాజ్ ఆటో వాటాదారులకు లాభాల్లో 47 శాతం వాటాను డివిడెండ్లుగా పంచింది. ఈ బాటలో గతేడాది డివిడెండ్ చెల్లింపులకు రూ. 3,472 కోట్లను వెచ్చించింది. తద్వారా అధిక చెల్లింపుల జాబితాలో 10వ ర్యాంకులో నిలిచింది. రూ. 16,000 కోట్లవరకూ మిగులు ఉన్నదని, దీనికితోడు వార్షికంగా రూ. 5,000 కోట్లు ఆర్జిస్తున్నట్లు బజాజ్ ఆటో తెలియజేసింది. దీంతో అధిక డివిడెండ్ పాలసీకి తెరతీసినట్లు వెల్లడించింది. కాగా.. దేశీ కార్పొరేట్ల వద్ద గతేడాదికల్లా నగదు నిల్వలు 13.8%కి చేరాయి. ఇందుకు ఐటీ కంపెనీల ఆర్జనల మెరుగుదలతోపాటు.. రిలయన్స్, ఎయిర్టెల్, టాటా మోటార్స్ తదితర కంపెనీల నిధుల సమీకరణ కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డిమాండ్ ఎఫెక్ట్ ఇటీవల డిమాండ్ మందగించడంతో ఆటో, ఎఫ్ఎంసీజీ, విద్యుత్ తదితర రంగాలలో భారీ విస్తరణ ప్రణాళికలు తగ్గినట్లు ఈక్వినామిక్స్ అండ్ రీసెర్చ్ అడ్వయిజరీ పేర్కొంది. దీంతో మరిన్ని కంపెనీలు డివిడెండ్ చెల్లింపులను పెంచడం, షేర్ల బైబ్యాక్‌లు వంటివి చేపట్టవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే అధిక డివిడెండ్లను చెల్లిస్తున్న కొన్ని కంపెనీలు తమ లాభాల్లో మరింతగా ఇన్వెస్టర్లకు అందించే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కోవిడ్ నేపథ్యంలోనూ గతేడాది(2019–20) ఫైనాన్షియల్‌యేతర రంగ కంపెనీలు 12.8% అధికంగా రూ.1.7 లక్షల కోట్లను వాటాదారులకు అందించినట్లు తెలిపారు. వెరసి 2019–20లో మొత్తం కంపెనీలు తమ నికర లాభాల్లో 78% వాటాను డివిడెండ్లకు కేటాయించాయి. అంతక్రితం ఏడాది ఇది 55% శాతమే. బైబ్యాక్‌లతో... 2019 జనవరి నుంచి చూస్తే పలు కంపెనీలు ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌లను చేపట్టాయి. తద్వారా దాదాపు రూ. 64,000 కోట్లను వెచ్చించాయి. ఈ జాబితాలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రాతోపాటు.. పీఎస్‌యూలు ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ప్రైవేట్ రంగ కంపెనీ అదానీ పోర్ట్స్ తదితరాలున్నాయి. పటిష్ట నిర్వహణ లాభాలు, నీరసించిన ట్రెజరీ ఈల్డ్స్, విస్తరణ ప్రణాళికల్లో మందగమనం వంటి అంశాలు పలు కంపెనీలను బైబ్యాక్, డివిడెండ్లవైపు ప్రోత్సాహిస్తున్నట్లు ఈ సందర్భంగా కార్పొరేట్ వర్గాలు తెలియజేశాయి. -
రిలయన్స్‌కు భారీగా నగదు నిల్వలు
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా నగదు నిల్వలు సమకూరుతాయని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, సీఎల్ఎస్ఏ అంచనా వేసింది. 4,000 కోట్ల డాలర్ల ప్రాజెక్ట్‌లు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయని, దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు భారీగా నగదు నిల్వలు లభిస్తాయని తన తాజా నివేదికలో సీఎల్ఎస్ఏ పేర్కొంది. ఇటీవలే ప్రారంభమైన రిఫైనరీ ఆఫ్–గ్యాస్ క్రాకర్,(ఆర్ఓజీసీ) త్వరలో ప్రారంభం కానున్న పెట్‌కోక్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్‌ల వల్ల ఇబిటా మరింత జోరుగా పెరుగుతుందని సంస్థ తెలిపింది. -
రూ.64,564 కోట్లకు జన్‌ధన్ డిపాజిట్లు
న్యూఢిల్లీ: సామాన్యుల కోసం మోదీ సర్కారు ప్రవేశపెట్టిన జన్‌ధన్ పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రూ.64,564కోట్లకు చేరాయి. ఈ పథకం కింద జీరో బ్యాలన్స్ సదుపాయంతో ఖాతాలు తెరిచి నిర్వహించుకోవచ్చు. ఈ ఏడాది జూన్ 14 నాటికి జన్‌ధన్ ఖాతాల సంఖ్య 28.9 కోట్లు. వీటిలో 23.27 కోట్లు ప్రభుత్వ బ్యాంకుల్లోవి కాగా, 4.7 కోట్లు గ్రామీణ బ్యాంకుల్లో, 92.7 లక్షల ఖాతాలు ప్రైవేటు బ్యాంకుల్లోనివి. ఈ మొత్తం ఖాతాల్లో నగదు నిల్వలు రూ.64,564 కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేసే నాటికి ఈ ఖాతాల్లోని డిపాజిట్లు రూ.64,252 కోట్లుగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనం మార్పిడికి జన్‌ధన్ ఖాతాలను ఉపయోగిస్తున్నారన్న ప్రచారం జరగ్గా ప్రభుత్వం హెచ్చరించడం తెలిసిందే. -
ఆన్లైన్ నమోదు నత్తనడక...!
గ్రామీణ పింఛన్ లబ్ధిదారుల బ్యాంకు, ఆధార్ వివరాలు ఇప్పటి వరకు 24 శాతం మాత్రమే ఆన్లైన్ ఎనిమిది మండలాల్లోనే చురుగ్గా నమోదు వచ్చేనెల బ్యాంకులో డబ్బులు జమ కష్టమే ఇందూరు : పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు నిల్వలు లేకపోవడంతో జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభావం పడింది. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో నగదు లేక పింఛన్ లబ్ధిదారులు, ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు డబ్బులు పొందలేకపోతున్నారు. ఇకపై వచ్చే నెల నుంచి పట్టణ ప్రాంతాల్లో మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లోని పింఛన్ లబ్ధిదారులకు కూడా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులను జమ చేయాలని నిర్ణయించాం. ఇందుకు అన్ని మండలాల ఎంపీడీఓలు గ్రామీణ ప్రాంతాల్లోని పింఛన్ లబ్ధిదారుల నుంచి బ్యాంకు ఖాతా, ఆధార్, ఫోన్ నెంబర్లు సేకరించి ఆసరా వెబ్సైట్లో ఈ నెల 7 లోగా నమోదు చేయండి. (జిల్లా కలెక్టర్ యోగితా రాణా పది రోజుల క్రితం ఎంపీడీఓలకు జారీ చేసిన ఆదేశాలు.) అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరయ్యాయి. గ్రామాల నుంచి పింఛన్ లబ్ధిదారుల వివరాలైన బ్యాంకు ఖాతాలు, ఆధార్, ఫోన్ నెంబర్ల సేకరణ చాల మండలాల్లో జరగనేలేదు. కలెక్టర్ వివరాల నమోదుకు ఇచ్చిన ఈ నెల 7 గడువు ముగిసిపోయింది. ఇందుకు 10 తేదీ వరకు గడువు పొడగించగా... ప్రస్తుతం వివరాలు సేకరించిన మండలాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఆన్లైన్లో వివరాలను నమోదు చేయిస్తున్నారు. దీంతో కలెక్టర్ అనుకున్నట్లు వచ్చే నెల పింఛన్ల పంపిణీ బ్యాంకు ఖాతాల ద్వారా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మళ్లీ నగదు డబ్బుల కోసం పింఛన్ లబ్ధిదారులు ఆందోళనలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నవంబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ ఇప్పటి వరకు కొనసాగుతోంది. డిసెంబర్‌కు సంబంధించిన పింఛన్ డబ్బులు ప్రభుత్వం నుంచి ఇదే నెలలో 18 లేదా 20 తేదీకి జిల్లాకు రానున్నాయి. బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్ల వివరాలు పూర్తి స్థాయిలో ఆసరా పింఛన్ల వెబ్సైట్లో ఇంకా నమోదు కాలేదు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పింఛన్ లబ్ధిదారులు కలిపి 1,90,357 మంది ఉన్నారు. ఇప్పటి వరకు అన్ని మండలాలు కలిపి కేవలం 45,724 మంది (24శాతం) వివరాలను మాత్రమే నమోదు చేశారు. ఇంకా 1,46,633 (76శాతం) మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. రెండు రోజుల్లో వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం కష్టమని సిబ్బంది అంటున్నారు. ఆ ఎనిమిది మండలాలు బెటర్... గ్రామాల్లోని పింఛన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్లను ఇవ్వాలని ఇందుకు గ్రామాల్లో దండోరా, టాంటాం చేయించాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. పంచాయతీ కార్యదర్శికి పింఛన్ లబ్ధిదారుల వివరాలు అందజేయాలని లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు. కలెక్టర్ ఈ ఆదేశాలిచ్చి పదిరోజులు అవుతున్నా కొన్ని మండలాల్లోనే పింఛన్ లబ్ధిదారుల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. మిగతా మండలాల్లో నమోదు ఇంకా ప్రారంభం కాకపోగా, మరికొన్ని మండలాల్లో 5 నుంచి 10 శాతం మంది వివరాలు నమోదు కాక నత్తనడకన సాగుతోంది. ప్రస్తుతం చురుగ్గా పని చేస్తున్న మండలాలు నిజామాబాద్ (75 శాతం), జక్రాన్‌పల్లి (57శాతం), ఆర్మూర్ (25శాతం), మోర్తాడ్ (35శాతం), నందిపేట్ (30శాతం), వర్ని (35శాతం), భీమ్‌గల్ (28శాతం), డిచ్పల్లి (25శాతం) ఉన్నాయి. మిగతా మండలాలైన బాల్కొండ, సిరికొండ, వేల్పూర్, ఎడపల్లి, మాక్లూర్, బోధన్, ధర్పల్లి, కమ్మర్పల్లి, సిరికొండ, నవీపేట్ తదితర మండలాలు వివరాల నమోదులో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఈ మండలాల్లో 5 నుంచి 10 శాతం కూడా వివరాల నమోదు దాటలేదు. ఒత్తిడి తెస్తున్న కలెక్టర్... నగదు నిల్వలు లేనందున డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులను చేతికి ఇవ్వకుండా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. లబ్ధిదారుల వివరాలు వేగంగా సేకరించి ఆన్లైన్లో నమోదు చేయించాలని ఎంపీడీఓలకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో పై ఎనిమిది మండలాల ఎంపీడీఓలు చురుగ్గా పని చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లతో రాత్రింబవళ్లు, సెలవు దినాల్లో కూడా పని చేయిస్తూ డాటా ఎంట్రీ చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు డీఆర్డీఏ అధికారులతో వివరాల నమోదు ఎంత వరకు వచ్చిందో కలెక్టర్ ఆరా తీయిస్తున్నారు. నమోదు వేగవంతం చేయాలని ఒత్తిడి తీవ్రం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న ఎంపీడీఓలకు నోటీసులు అందే సూచనలు కనిపిస్తున్నాయి. -
క్యాష్ కష్టాలు.. ఏ‘మనీ’ చెప్పాలి
-
క్యాష్ కష్టాలు.. ఏ‘మనీ’ చెప్పాలి
80 శాతం ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు బ్యాంకుల్లోనూ అదే పరిస్థితి నగరంలో కొంత పర్వాలేకున్నా.. గ్రామీణంలో దారుణం జీతభత్యాలు అందక..ఉద్యోగులు పింఛనుకు నోచుకోక వృద్ధులు, వికలాంగుల పాట్లు నగదు ఉన్న బ్యాంకుల్లోనూ సర్దు‘పాట్లు’ సాక్షి విజిట్‌లో వెల్లడైన వాస్తవాలు నగదు నిల్వలు రూ.100 కోట్లు ఉన్నారుు.. బుధవారం మరో రూ.162 కోట్లు వచ్చారుు..కానీ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన జీతభత్యాలు, పెన్షన్ల మొత్తంరూ.900 కోట్లు.. వీరు కాక నగదు కోసం బ్యాంకులకు వచ్చే సామాన్య ప్రజలు, వ్యాపారులుఉండనే ఉంటారు.. ఈ అంకెలు చూస్తే చాలు.. ఎందరు జీతాలు అందుకున్నారో.. మరెందరు వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం అగచాట్లు పడ్డారో అర్థమైపోతుంది..ఎవరికీ ఏ ఇబ్బంది లేదని నగదు సర్దుబాటు చేశామన్న అధికారుల ప్రకటనలను.. ‘నో క్యాష్’ బోర్డులతో దర్శనమిస్తున్న 80 శాతానికిపైగా ఏటీఎంలు, బ్యాంకు శాఖలు వెక్కిరిస్తున్నారుు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద పరిస్థితిని తెలుసుకునేందుకు ‘సాక్షి’ నిర్వహించిన విజిట్‌లో ఇవన్నీ కళ్లకు కట్టారుు. విశాఖపట్నం : ‘బ్యాంకుల్లో చాలినంత నగదు ఉంది.. 98 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నారుు. ఉద్యోగుల జీతభత్యాలకే కాదు..రిటైర్డు ఉద్యోగులకు పింఛన్ చెల్లింపులకూ ఎలాంటి ఇబ్బందిలేదు. సామాజిక పింఛన్‌దారులకు వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం.రూపే కార్డుతో ఇలా గీకి..అలా సొమ్ము తీసుకోవచ్చు’.. అని జిల్లా అధికారులు ఆర్భాటం చేశారు. కానీ వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నారుు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా సాక్షి బృందం ఒకేసారి మండల కేంద్రాలతోపాటు నగరంలోని బ్యాంకులు, ఏటీఎంల పనితీరుపై క్షేత్ర స్థారుు పరిశీలన చేసింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఉద్యోగులు, పింఛన్‌దారులు, వృద్ధులు, వికలాంగులు పడుతున్న పాట్లు.. నగదు కోసం వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. 20 శాతం మందికి దక్కితే గొప్పే జిల్లాలో 45 బ్యాంకుల పరిధిలో 738 శాఖలు ఉన్నారుు. వీటి వద్ద రూ.100 కోట్ల నగదు నిల్వలున్నాయని, బుధవారం రూ.162 కోట్లు వచ్చాయని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఉద్యోగస్తులు, రిటైర్డు ఉద్యోగులకు వారానికి గరిష్ట పరిమితికనుగుణంగా రూ.24 వేలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని గొప్పగా చెప్పింది. కానీ తొలిరోజే కనీసం 20 శాతం మంది కూడా పట్టుమని రూ. 10 వేలైనా అందుకోలేకపోయారు. పోనీ శుక్రవారమైనా అందుతాయన్న ఆశతో బ్యాంకుల బాటపట్టిన వీరికి రెండోరోజు కూడా నిరాశే మిగిలింది. సాక్షి పరిశీలనలో ఏటీఎంలే కాదు.. చాలా బ్యాంకుల వద్ద సైతం నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చారుు. సగానికి పైగా బ్యాంకు శాఖల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చారుు. మిగిలిన వాటిలో మూడొంతులు శాఖల్లో రూ.5వేల చొప్పునే సర్దుబాటు చేశారు. కొన్ని శాఖల్లో అరుుతే రూ.4 వేలే ఇవ్వడం కన్పించింది. జీవీఎంసీ పరిధిలోని 50 శాఖల్లోనే రూ.10వేల చొప్పున ఉద్యోగులకు ఇవ్వగలిగారు. దీంతో రెండో రోజు బ్యాంకుల ద్వారా జీతాలు, పింఛన్లు అందుకున్న వారు పది శాతానికి మించి ఉండరని బ్యాంకు అధికారులే అంటున్నారు.ఇక ఏటీఎంల ద్వారా కనీసం రూ.2,500 చొప్పునైనా తీసుకుందామని ఉద్యోగులు, పింఛన్‌దారులు పరుగులు తీస్తే 80శాతం ఏటీఎంల వద్దనో క్యాష్ బోర్డులే దర్శనమిచ్చారుు. పని చేస్న్ను పది శాతం ఏటీఎంలలో రూ.2వేల నోట్లు తప్ప చిల్లర నోట్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇవీ ఉద్యోగుల లెక్కలు జిల్లాలో 25వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 13 వేల మంది ఉపాధ్యాయులు, జూనియర్ కళాశాలల నుంచి వైద్యకళాశాలల వరకు ఉన్నత విద్యాసంస్థల్లో మరో 10వేల మందికి పైగా ఉన్నారు. అలాగే సుమారు 39 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 75వేల మంది ఉద్యోగులు.. యూనివర్సిటీలు, జాతీయ విద్యాసంస్థల్లో సుమారు 5వేల మంది అధ్యాపకులు, ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. 55వేల మంది రిటైర్డు ఉద్యోగులున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి రూ.250 కోట్లు, పెన్షనర్లకు రూ.75 కోట్లు, ప్రతి నెలా జీతభత్యాలు, పింఛన్ల రూపంలో చెల్లిస్తుంటారు. కేంద్ర ప్రభత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు సుమారు రూ.400 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇక ప్రైవేటు సెక్టార్, అసంఘటిత రంగంలో సుమారు రెండులక్షల మంది ఉద్యోగులు, కార్మికులు ఉంటే వీరికి జీతభత్యాల రూపంలో రూ.150 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయని అంచనా. ఈ లెక్కన జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు, కార్మికులకు రూ.900 కోట్లు అవసరం. మరో పక్క జిల్లాలో 3.24 లక్షల మంది సామాజిక పింఛన్‌దారులున్నారు. వీరికి ప్రతి నెలా 35.66కోట్లు అవసరం. సామాజిక పింఛన్‌దారుల్లో అకౌంట్లున్న 2.06 లక్షల మందికి వారి ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేసినట్టుగా అధికారులు చెప్పినప్పటికీ రెండో రోజు కూడా ఏ ఒక్కరికి పింఛన్ అందలేదు. -
టాటా స్టీల్ నష్టం... రూ.3,214 కోట్లు
12 శాతం తగ్గిన ఆదాయం * ఒక్కో షేర్‌కు రూ.8 డివిడెండ్ న్యూఢిల్లీ: టాటా స్టీల్ సంస్థ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.3,214 కోట్ల నికర నష్టాల్ని ప్రకటించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే క్వార్టర్లో వచ్చిన నష్టాలు రూ.5,702 కోట్లతో పోలిస్తే ఈ క్యూ4లో నష్టాలు తగ్గినట్లే. అయితే గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక నష్టాలు రూ.2,127 కోట్లతో పోలిస్తే 4వ త్రైమాసికంలో నష్టాలు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.33,666 కోట్ల నుంచి 12 శాతం క్షీణించి రూ.29,508 కోట్లకు తగ్గినట్లు టాటా స్టీల్ గ్రూప్ ఈడీ (ఫైనాన్స్ అండ్ కార్పొరేట్) కౌశిక్ చటర్జీ తెలిపారు. ఉక్కు డెలివరీలు 7.06 మిలియన్ టన్నుల నుంచి 6.94 మిలియన్ టన్నులకు తగ్గాయని చెప్పారు. ఒక్కో షేర్‌కు రూ.8 డివిడెండ్‌ను ప్రకటిస్తూ... కళింగనగర్ స్టీల్ ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిందన్నారు. రూ.20,514 కోట్ల నగదు నిల్వలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.11,486 కోట్ల మూలధన పెట్టుబడుల్లో కళింగనగర్ ప్లాంట్‌పై రూ.3,695 కోట్లు వెచ్చించినట్లు చటర్జీ తెలిపారు. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.20,514 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. కీలకం కాని ఆస్తుల విక్రయాన్ని కొనసాగించామని, ఇలాంటి ఆస్తుల విక్రయం ద్వారా రూ.4,478 కోట్లు సమీకరించామని చెప్పారాయన. యూరప్ కార్యకలాపాల పునర్వ్యస్థీకరణకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.3,926 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,049 కోట్లకు తగ్గాయని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.1.40 లక్షల కోట్ల నుంచి రూ.1.17 లక్షల కోట్లకు తగ్గిందని చెప్పారు. -
వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనం!
న్యూఢిల్లీ: నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ ఇండియాను విలీనం చేసుకోవాలని వేదాంత ఇండియా యోచిస్తోంది. తద్వారా భారీ రుణ భారాన్ని తగ్గించుకోవచ్చని భావిస్తోంది. ఈ డీల్‌తో వేదాంత స్థూల రుణ భారం సుమారు రూ. 37,636 కోట్ల మేర తగ్గవచ్చని అంచనా. కెయిర్న్ వద్ద ఉన్న రూ. 16,870 కోట్లు, దాంతో పాటు ఏటా కంపెనీకి వచ్చే రూ. 14,000 కోట్ల మేర నిధులు దీనికి తోడ్పడగలవని వేదాంత యోచిస్తోంది. విలీనానికి సంబంధించి డీల్ పూర్తిగా షేర్ల రూపంలో ఉండనుంది. కెయిర్న్‌ఇండియా షేర్హోల్డర్లకు వేదాంత (గతంలో సెసా స్టెరిలైట్) షేర్లు లభించనున్నాయి. ఇరు కంపెనీల బోర్డులు విలీన ప్రతిపాదనను త్వరలో పరిశీలించనున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా డీల్ పూర్తి కావొచ్చని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2011లో వేదాంత 8.67 బిలియన్ డాలర్లు వెచ్చించి కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చి 31 దాకా గణాంకాల ప్రకారం వివిధ వ్యాపార విభాగాల ద్వారా కెయిర్న్ ఇండియాలో వేదాంతకు 59.9 శాతం వాటాలు ఉన్నాయి. విలీనానికి శ్రీకారం చుట్టే దిశగా వేదాంత ఇటీవలే.. గ్రూప్‌లో భాగమైన ట్విన్ స్టార్ మారిషస్ హోల్డింగ్స్ నుంచి సుమారు 5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. విలీన ప్రతిపాదనపై స్పందించేందుకు నిరాకరించిన వేదాంత వర్గాలు.. కార్పొరేట్ స్వరూపాన్ని సరళతరం చేసే యోచనలో కంపెనీ ఉన్నట్లు వివరించాయి. -
ఆంధ్రాకు రూ.7155 కోట్లు తెలంగాణకు 3756 కోట్లు
రెండు రాష్ట్రాల పీడీ ఖాతాల్లో నగదు నిల్వల లెక్కతేల్చిన అధికారులు హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని వ్యక్తిగత డిపాజిట్ల(పీడీ ఖాతా) లోని నగదు నిల్వలు రెండు రాష్ట్రాలకు జూన్ 2వ తేదీ నుంచి పంపిణీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, పట్ణణ, గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన పీడీ ఖాతాల్లోని నగదు నిల్వలను మరోసారి సరిచూసి ఈ నెలాఖరులోగా లెక్కలు తేల్చాల్సిందిగా అన్ని శాఖలను ఆర్థిక శాఖ శనివారం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిల్లో ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రంలో 72,547 పీడీ ఖాతాలున్నాయి. అందులో ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 43,343 పీడీ ఖాతాల్లో రూ.7155.45 కోట్లు నిల్వ ఉండగా తెలంగాణలోని 10 జిల్లాల్లో 29,204 పీడీ ఖాతాల్లో రూ.3756.77 కోట్లు నిల్వ ఉన్నట్లు తేల్చారు. ఈ పీడీ ఖాతాల్లో నిల్వలను నెలాఖరులోగా సరి చూసి లెక్క తేల్చాల్సిందిగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఖాతాల్లో నిల్వలను సరిచూసి జూన్ 2వ తేదీ నుంచి పీడీ ఖాతాల్లో కచ్చిత నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రంలో 35 పీడీ ఖాతాలున్నాయని, ఆ ఖాతాలు జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొత్త పీడీ ఖాతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేషన్లు, కేంద్రాలకు చెందినవి 75 పీడీ ఖాతాలుండగా ఆ ఖాతాలు రెండు రాష్ట్రాలకూ చెందుతాయని పేర్కొన్నారు.