వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనం! | Vedanta, Cairn India likely to be merged | Sakshi
Sakshi News home page

వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనం!

Published Wed, Jun 10 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనం!

వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనం!

న్యూఢిల్లీ: నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ ఇండియాను విలీనం చేసుకోవాలని వేదాంత  ఇండియా యోచిస్తోంది. తద్వారా భారీ రుణ భారాన్ని తగ్గించుకోవచ్చని భావిస్తోంది. ఈ డీల్‌తో వేదాంత స్థూల రుణ భారం సుమారు రూ. 37,636 కోట్ల మేర తగ్గవచ్చని అంచనా. కెయిర్న్ వద్ద ఉన్న రూ. 16,870 కోట్లు, దాంతో పాటు ఏటా కంపెనీకి వచ్చే రూ. 14,000 కోట్ల మేర నిధులు దీనికి తోడ్పడగలవని వేదాంత యోచిస్తోంది. విలీనానికి సంబంధించి డీల్ పూర్తిగా షేర్ల రూపంలో ఉండనుంది. కెయిర్న్‌ఇండియా షేర్‌హోల్డర్లకు వేదాంత (గతంలో సెసా స్టెరిలైట్) షేర్లు లభించనున్నాయి.

ఇరు కంపెనీల బోర్డులు విలీన ప్రతిపాదనను త్వరలో పరిశీలించనున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా డీల్ పూర్తి కావొచ్చని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2011లో వేదాంత 8.67 బిలియన్ డాలర్లు వెచ్చించి కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది.

ఈ ఏడాది మార్చి 31 దాకా గణాంకాల ప్రకారం వివిధ వ్యాపార విభాగాల ద్వారా కెయిర్న్ ఇండియాలో వేదాంతకు 59.9 శాతం వాటాలు ఉన్నాయి. విలీనానికి శ్రీకారం చుట్టే దిశగా వేదాంత ఇటీవలే.. గ్రూప్‌లో భాగమైన ట్విన్  స్టార్ మారిషస్ హోల్డింగ్స్ నుంచి సుమారు 5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. విలీన ప్రతిపాదనపై స్పందించేందుకు నిరాకరించిన వేదాంత వర్గాలు.. కార్పొరేట్ స్వరూపాన్ని సరళతరం చేసే యోచనలో కంపెనీ ఉన్నట్లు వివరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement