ఆర్గానిక్‌ ఫుడ్‌తో ‘జీవాతి’ రెస్టారెంట్‌ | jeevathi reastaurent in hyderabad with organic food | Sakshi
Sakshi News home page

ఆర్గానిక్‌ ఫుడ్‌తో ‘జీవాతి’ రెస్టారెంట్‌

Published Fri, Jan 20 2017 1:31 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

ఆర్గానిక్‌ ఫుడ్‌తో ‘జీవాతి’ రెస్టారెంట్‌

ఆర్గానిక్‌ ఫుడ్‌తో ‘జీవాతి’ రెస్టారెంట్‌

దేశ విదేశాల్లో రెస్టారెంట్లు, స్టోర్లు
విస్తరణలో సృష్టి ఆర్గానిక్‌ ఫుడ్స్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పూర్తిగా సేంద్రియ ధాన్యాలతో రూపొందిన ఆహార పదార్థాలను వడ్డించే రెస్టారెంట్‌ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ఐఐఎం విద్యార్థులతో ప్రారంభమైన సృష్టి ఆర్గానిక్‌ ఫుడ్స్‌ ఇక్కడి జూబ్లీహిల్స్‌లో జీవాతి పేరుతో ఈ కేంద్రాన్ని నెలకొల్పింది. రెస్టారెంట్‌తోపాటు ఆర్గానిక్‌ స్టోర్‌ సైతం ఇందులో ఏర్పాటు చేశారు. 150కిపైగా ఆర్గానిక్‌ ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తామని సృష్టి ఆర్గానిక్‌ ఫుడ్స్‌ ప్రమోటర్‌ ఆనంద్‌ కుమార్‌ మంద తెలిపారు. కొద్ది రోజుల్లో ఆర్గానిక్‌ నాన్‌–వెజ్‌ రెస్టారెంట్‌ సైతం అందుబాటులోకి తెస్తామన్నారు. క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు, ఫుడ్‌ ఆన్‌ వీల్స్‌ విధానంలో కేంద్రాలను స్థాపించనున్నట్టు వెల్లడించారు.

విదేశాల్లో సైతం..: భారత్‌లోని పలు నగరాలతోపాటు ఆస్ట్రేలియా, యూఎస్‌ తదితర విదేశీ మార్కెట్లలో రెస్టారెంట్లు, స్టోర్లను విస్తరిస్తామని మరో ప్రమోటర్‌ మహేంద్ర భరద్వాజ్‌ తెలిపారు. సొంతంగా, భాగస్వామ్యం, ఫ్రాంచైజీల ద్వారా వీటిని నెలకొల్పుతామని చెప్పారు. సొంత ఈ–కామర్స్‌ పోర్టల్‌ త్వరలో ప్రారంభిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement