జియో ఎఫెక్ట్..టెలికం ఆదాయం 11% డౌన్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్రభావం టెలికం రంగంపై బాగానే పడింది. పరిశ్రమ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 11.7 శాతం మేర క్షీణించింది. ఇక త్రైమాసికం పరంగా చూస్తే ఆదాయంలో 8.5 శాతం క్షీణత నమోదయ్యింది. జెఫెరీస్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ఆదాయం క్షీణతకు జియో సబ్‌స్క్రైబర్ల పెరుగుదల, ఉచిత ఆఫర్లు ప్రధాన కారణం. మెట్రోలు, ‘ఏ’ సర్కిళ్లలో అంటే జియో విస్తరణ, వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాం తాల్లో ప్రతికూల ప్రభావం అధికంగా ఉంది.