Jefferies report
-
ఏటా రూ.10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారతీయులు వివాహానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలియనది కాదు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుక కోసం ఎంత ఖర్చుకైనా సరే తగ్గేదే లేదంటున్నారు. వివాహాల కోసం భారతీయులు ఏటా రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ తెలిపింది. అది కూడా విద్యపై చేసే వ్యయం కంటే వివాహాల కోసం చేస్తున్నదే రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. వ్యయాల పరంగా ఆహారం, గ్రోసరీ (ఎఫ్ఎంసీజీ) తర్వాతి స్థానంలో పెళ్లిళ్లు ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ఇంకా ఈ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. భారత్‌లో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు జరుగుతున్నాయి. అదే చైనాలో ఏటా 70–80 లక్షలు, అమెరికాలో 20–25 లక్షల వరకు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అమెరికాలో వివాహాల కోసం అక్కడి వారు చేస్తున్న వార్షిక వ్యయం 70 బిలియన్ డాలర్లు (రూ.5.81 లక్షల కోట్లు) కంటే భారతీయుల వ్యయం రెట్టింపుగా ఉంది. ఇక చైనాలో ఏటా జరిగే పెళ్లి వేడుకలు భారత్ కంటే 20 శాతం మేర తక్కువే ఉన్నప్పటికీ.. భారతీయుల కంటే 50 శాతం అధికంగా 170 బిలియన్ డాలర్లు (రూ.14.11 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వినియోగంలో భారత్‌లో రిటైల్ వినియోగ విభాగంలో వివాహాలది రెండో స్థానం. ఆహారం, గ్రోసరీలపై చేస్తున్న 681 బిలియన్ డాలర్లు (రూ.56.52 లక్షల కోట్లు) తర్వాత వివాహాలకే ఎక్కువ కేటాయిస్తున్నారు. వివాహం అంటే ఎన్నో రకాల కొనుగోళ్లతో ఉంటుందని తెలిసిందే. ముఖ్యంగా బంగారం ఆభరణాలు, వస్త్రాలు, వేడుక నిర్వహణ కేంద్రాలు, హోటల్ బుకింగ్‌లు, అలంకరణలు, ఆహారంపై భారీగా వ్యయం చేయాల్సి వస్తుంది. వివాహాలు పరోక్షంగా ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లకూ మద్దతునిస్తాయి. ప్రాంతం, మతం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పెళ్లిళ్లపై చేసే వ్యయాలు కూడా ఆధారపడి ఉంటాయని తెలిసిందే. ‘‘ఏటా 8–10 మిలియన్ల వివాహాలతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంటోంది. రిటైలర్ల సమాఖ్య సీఏఐటీ అంచనా ప్రకారం చూస్తే దీని పరిమాణం 130 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. యూఎస్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు. కీలక వినియోగ విభాగాలకు వివాహాలు ఊతమిస్తున్నాయి. విలువలకు ప్రాధాన్యమిచ్చే భారతీయ సమాజంలో వివాహాలపై ఖర్చు చేసేందుకు ఇష్టపడుతుంటారు. వారి సంపద, ఆదాయ స్థాయిలకు అనుగుణంగా ఈ వ్యయాలు ఉంటాయి. ఆర్థిక తరగతులతో సంబంధం లేకుండా అధిక వ్యయం చేసే ధోరణి కూడా నెలకొంది’’అని జెఫరీస్ నివేదిక వివరించింది. ఒక్కో పెళ్లికి రూ.1.25 లక్షలు ఒక్కో వివాహంపై చేసే ఖర్చు సగటున 15,000 డాలర్లు (రూ.1.25 లక్షలు సుమారు)గా ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ‘‘ఇది తలసరి ఆదాయం కంటే రెట్టింపు. గ్రాడ్యుయేషన్ వరకు విద్యపై చేసే ఖర్చు కంటే రెండు రెట్లు అధికంగా ఒక జంట వివాహంపై వెచి్చస్తోంది. అదే యూఎస్‌లో వివాహంపై చేసే సగటు ఖర్చు విద్యలో సగమే ఉంటోంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. ఖరీదైన ఆతిథ్యాలు, భారీ మెనూతో కూడిన ఆడంబరమైన కేటరింగ్, స్టార్ చెఫ్‌లు రూపొందించిన మెనూలు, నటులు, సెలబ్రిటీల ప్రదర్శనలను భారత్‌లో ఖరీదైన వివాహాల్లో చూ డొచ్చని పేర్కొంది. ‘‘వివాహ మార్కెట్ పరిమాణం దృష్ట్యా చూస్తే భారత్‌లో ఆభరణాలు, వ్రస్తాలు, కేటరింగ్, ప్రయాణాలు తదితర రంగాల్లో డిమాండ్‌కు ఇది మద్దతుగా నిలుస్తోంది. పరోక్షంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెయింట్స్‌కు సైతం డిమాండ్‌ను తెచ్చి పెడుతోంది’’అని వివరించింది. -
2027 నాటికి భారత్... టాప్3
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్‌పై అంతర్జాతీయ పెట్టుబడి సలహా సంస్థ జెఫరీస్ ఆశాజనక అంచనాలను ఆవిష్కరించింది. గత పదేళ్లలో భారతదేశం మౌలిక నిర్మాణాత్మక సంస్కరణలను చూసిందని, దేశం తన పూర్తి సామర్థ్యాలను చూసేందుకు కావాల్సిన కార్యాచరణను ఇది సృష్టించిందని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేసే జెఫరీస్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. వచ్చే నాలుగేళ్లలో భారత జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.415 లక్షల కోట్లు) చేరుకుంటుందని, 2027 నాటికి జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. స్థిరమైన వృద్ధి ప్రక్రియలో భాగంగా, 2030 నాటికి భారత స్టాక్ మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని జెఫరీస్ అంచనా వేసింది. ప్రస్తుతం భారత్ మార్కెట్ 4.3 ట్రిలియన్ డాలర్లు విలువతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. టాప్4లో అమెరికా (44.7 ట్రిలియన్ డాలర్లు), చైనా (9.8 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (6 ట్రిలియన్ డాలర్లు), హాంకాంగ్ (4.8 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి. గత 5–20 సంవత్సరాల కాలంలో భారత ఈక్విటీ మార్కెట్ డాలర్ మారకంలో ఏటా 10 శాతం చొప్పున స్థిరమైన రాబడిని ఇచ్చింది. వర్ధమాన మార్కెట్లలో ఏ ఇతర దేశంతో పోల్చి చూసినా మెరుగైన పనితీరు చూపించింది. మూలధన వ్యయాలు తిరిగి పుంజుకోవడం, కంపెనీలు బలమైన ఆదాయాలను నమోదు చేసే స్థితిలో ఉండడం వల్ల భారత మార్కెట్ వచ్చే 5–7 ఏళ్లలోనూ మంచి వృద్ధిని నమోదు చేయనుంది’’అని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. భారత ఈక్విటీల్లోకి భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ప్రవహించేందుకు ఉన్న అవకాశాలను జెఫరీస్ ప్రస్తావించింది. ఇప్పటికీ గృహ పొదుపులో కేవలం 4.7 శాతమే ఈక్విటీల్లోకి వస్తున్నట్టు తెలిపింది. డిజిటల్‌గా ఎంతో పురోగతి సాధించడంతో సంప్రదాయ, రిటైల్ ఇన్వెస్టర్ల మధ్య అంతరాన్ని తగ్గించినట్టు వివరించింది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు అసాధారణ స్థాయిలో మార్కెట్ ప్రవేశాన్ని పొందుతున్నట్టు తెలిపింది. సిప్‌కు అమిత ఆదరణ పెరగడం, పెట్టుబడుల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లలో ఉన్న క్రమశిక్షణను తెలియజేస్తోందని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో, భారత ఈక్విటీ మార్కెట్లోకి మరింతగా పొదుపు నిధులు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. బహుళజాతి కంపెనీల లిస్టింగ్ బలమైన వృద్ధి గమనం, మార్కెట్ల పెరుగుదల, అధిక రాబడుల ట్రాక్ రికార్డ్ ఇవన్నీ విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాయని జెఫరీస్ పేర్కొంది. దక్షిణ కొరియా బహుళజాతి సంస్థ హ్యుందాయ్ ఇండియా తన భారతీయ అనుబంధ సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్న నిర్ణయాన్ని ప్రస్తావించింది. బలమైన భవిష్యత్తుకు పునాది అధిక వృద్ధికి అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం చేపట్టిన నిరంతర సంస్కరణలను నివేదిక ప్రశంసించింది. ‘‘దేశంలో సులభతర వ్యాపారాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించే లక్ష్యంతో 2014 నుంచి మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తోంది. 2017 నాటి చరిత్రాత్మక జీఎస్టీ చట్టం అనేక పన్నుల నిర్మాణాలను ఏకైక ఉమ్మడి జాతీయ విధానంగా కుదించింది ఇది. రాష్ట్రాల వ్యాప్తంగా ’యూరోజోన్’ శైలి వస్తువులు, సేవల ప్రవాహాన్ని సృష్టించింది. బ్యాంకింగ్ వ్యవస్థ మొండి బకాయిల ప్రక్షాళనను వేగవంతం చేయడంలో 2016 నాటి దివాలా చట్టం కీలకంగా మారింది. 2017 రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ (రెరా) విస్తారమైన, అసంఘటిత స్థిరాస్తి రంగాన్ని ప్రక్షాళన చేయడానికి సహాయపడింది’’ అని నివేదిక పేర్కొంది. -
ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎంకు మరో భారీ షాక్!.. ఇదే తొలిసారి
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేటీఎంకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జెఫరీస్ రేటింగ్‌ను తగ్గించింది.పేటీఎం ఆదాయం ఏటేటా 28 శాతం క్షీణించిందని, ఇది 'తక్కువ పనితీరు' నుంచి 'నాట్ రేటింగ్'కు మారిందని జెఫరీస్ తెలిపింది. ఒకవేళ ఆర్బీఐ పేటీఎంపై చర్యలు తీసుకోకపోయినట్లైతే రెవెన్యూ ట్రాక్షన్, వ్యయ నియంత్రణల నుండి ఉత్పన్నమయ్యే సానుకూల, ప్రతికూలతల్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. అయితే పేటీఎంపై ఆర్బీఐ చర్యలు కొనసాగుతున్నట్లు వస్తున్న నివేదికల నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెఫరీస్ తన నోట్లో పేర్కొంది. రేటింగ్ ఎందుకు కార్పొరేట్ రంగంలో ఆయా కంపెనీల తీరు ఎలా ఉంది? ఆర్ధికంగా సదరు సంస్థ సామర్ధ్యాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై ఇండిపెండెంట్ క్రెడింగ్ రేటింగ్ ఏజెన్సీలు రేటింగ్స్ ఇస్తుంటాయి. ఆ రేటింగ్స్ ఆధారంగా సంస్థల్లో పెట్టుబడులు, వినియోగదారుల్లో నమ్మకం ఉందని అర్ధం. అలా కాకుండా ఏ మాత్రం నెగిటీవ్ రేటింగ్ ఇస్తే సంబంధిత కంపెనీపై నమ్మకం సన్నగిల్లుతుంది. -
Jefferies report: ఆర్థిక వ్యవస్థకు శ్రీరామజయం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా శోభిల్లనుంది. దేశంలోని ఇతర ప్రముఖ ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలను దాటి పర్యాటకుల సందర్శన పరంగా అయోధ్య మొదటి స్థానానికి చేరుకోనుంది. బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ వేసిన అంచనా ప్రకారం ఏటా సుమారు 5 కోట్ల మంది సందర్శకులు అయోధ్యకు రానున్నారు. నూతన విమానాశ్రయం, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్, టౌన్షిప్, రహదారుల అనుసంధానం కోసం చేసిన 10 బిలియన్ డాలర్ల వ్యయానికి తోడు కొత్త హోటళ్ల రాక ఇవన్నీ అయోధ్యలో ఆర్థిక కార్యకలాపాల విస్తృతిని పెంచుతాయని జెఫరీస్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య విలసిల్లుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో ఎంతో విశిష్టత కలిగిన తిరుమల ఆలయాన్ని ఏటా 3 కోట్ల మంది వరకు భక్తులు సందర్శిస్తున్నారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు సైతం ఇదే స్థాయిలో సందర్శకులు వస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే వాటికన్ సిటీని ఏటా 90 లక్షల మంది, సౌదీ అరేబియాలోని మక్కాను 2 కోట్ల మంది సందర్శిస్తున్నారు. ఊపందుకోనున్న టూరిజం ‘‘ఆధ్యాత్మిక పర్యాటకం అనేది భారత పర్యాటక రంగంలో అతిపెద్ద విభాగంగా ఉంది. మౌలిక వసతుల సమస్యలు ఉన్నప్పటికీ పలు ప్రముఖ ఆధాతి్మక కేంద్రాలకు ఏటా 1–3 కోట్ల మధ్య పర్యాటకులు విచ్చేస్తున్నారు. మరింత మెరుగైన వసతులు, అనుసంధానంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కేంద్రం (అయోధ్య) చెప్పుకోతగ్గ స్థాయిలో ఆర్థిక ప్రభావం చూపించనుంది’’అని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. కరోనాకు ముందు 2018–19 ఆర్థిక సంవత్సరం జీడీపీలో పర్యాటక రంగం 194 బిలియన్ డాలర్ల వాటా కలిగి ఉంటే, అది ఏటా 8 శాతం కాంపౌండెడ్ వృద్ధితో 2022–23 నాటికి 443 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. దేశ జీడీపీలో పర్యాటక రంగం వాటా 6.8 శాతంగా ఉందని, అభివృద్ధి చెందిన, ప్రముఖ అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నట్టు వివరించింది. ‘‘పర్యాటకం అయోధ్యకు ఆర్థికపరమైన, మతపరమైన వలసలను పెంచుతుంది. దీంతో హోటళ్లు, ఎయిర్‌లైన్స్, హాస్పిటాలిటీ, ఎఫ్ఎంసీజీ, పర్యాటక అనుబంధ రంగాలు, సిమెంట్ రంగాలు లాభపడనున్నాయి’’అని జెఫరీస్ పేర్కొంది. అయోధ్యలో వసతులు అయోధ్య ఎయిర్పోర్ట్ మొదటి దశ అందుబాటులోకి రాగా, ఏటా 10 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యానికి సేవలు అందించే అదనపు దేశీయ, అంతర్జాతీయ టెరి్మనల్ 2025 నాటికి రానుంది. రోజువారీ 60 వేల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. 1,200 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ టౌన్షిప్ నిర్మాణాన్ని తలపెట్టారు. రోడ్ల కనెక్టివిటీని పెంచారు. ప్రస్తుతం 17 హోటళ్లు 590 రూమ్‌లను కలిగి ఉన్నాయి. కొత్తగా 73 హోటళ్లకు ప్రణాళికలు ఉన్నాయి. ఇందులో 40 హోటళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. ఇండియన్ హోటల్స్, మారియట్, విందమ్ ఇప్పటికే హోటళ్ల కోసం ఒప్పందాలు చేసుకున్నాయి. ఐటీసీ సైతం హోటల్ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. ఓయో సైతం 1,000 హోటల్ రూమ్‌లను తన ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావాలని భావిస్తోంది. -
ఇక జియో ఫైనాన్షియల్ సర్వీసులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తమ ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. ఇందుకు వాటాదారులు, రుణదాతలు తాజాగా ఆమోదముద్ర వేశారు. తొలుత రిలయన్స్ స్ట్రాటజిక్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఎస్ఐఎల్) పేరుతో విడదీయనున్న కంపెనీని తదుపరి జియో ఫైనాన్షియల్ సర్వీసులుగా మార్పు చేయనున్నారు. వాటాదారుల సమావేశంలో ఈ ప్రతిపాదనకు 99.99 శాతం ఓట్లు లభించినట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. కాగా.. ఆర్ఐఎల్ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకీ రూ. 10 ముఖ విలువగల ఆర్ఎస్ఐఎల్ షేరును జారీ చేయనున్నారు. తదుపరి ఆర్ఎస్ఐఎల్.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(జేఎఫ్ఎస్ఎల్)గా ఆవిర్భవించనుంది. సెప్టెంబర్‌కల్లా లిస్టింగ్ జెఫరీస్ రీసెర్చ్ వివరాల ప్రకారం జేఎఫ్ఎస్ఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో సెప్టెంబర్‌కల్లా లిస్ట్‌కానుంది. ఇందుకు అప్పటికల్లా అన్ని అనుమతులూ లభించగలవని అభిప్రాయపడింది. కంపెనీ వెనువెంటనే రుణ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. అసెట్ మేనేజ్మెంట్, జీవిత, సాధారణ బీమా విభాగాలకు నియంత్రణ సంస్థల అనుమతులను కోరనుంది. వీటిని 12–18 నెలల్లోగా పొందే వీలున్నట్లు జెఫరీస్ పేర్కొంది. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని విడదీసేందుకు గతేడాది అక్టోబర్‌లో ఆర్ఐఎల్ గ్రూప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఐఎల్కు పూర్తి అనుబంధ సంస్థగా ఆర్ఎస్ఐఎల్ వ్యవహరిస్తోంది. ఆర్బీఐ వద్ద రిజిస్టరై డిపాజిట్లు సమీకరించని ప్రధాన ఎన్‌బీఎఫ్‌సీగా కొనసాగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు 1.2 శాతం బలపడి రూ. 2,448 వద్ద ముగిసింది. కామత్‌కు బాధ్యతలు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో కేవీ కామత్‌ను జేఎఫ్‌ఎస్‌ఎల్‌కు నాన్ఎగ్జిక్యూటివ్గా చైర్మన్‌గా ఆర్ఐఎల్ ఎంపిక చేసింది. 2021–22లో ఈ విభాగం రూ. 1,536 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 27,964 కోట్ల సంయుక్త ఆస్తులను కలిగి ఉంది. బ్రోకింగ్ సంస్థ మెక్వారీ వివరాల ప్రకారం జియో ఫైనాన్షియల్ విలువ రూ. 1.52 లక్షల కోట్లకుపైనే. దేశీయంగా ఐదో అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థగా నిలవనుంది. -
దేశీ బ్యాంకింగ్‌పై ‘క్రెడిట్ సూసీ’ ప్రభావం ఉండదు..
న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ వ్యవస్థపై స్విస్ బ్యాంకు క్రెడిట్ సూసీ సంక్షోభ ప్రభావాలేమీ ఉండకపోవచ్చని ఆర్థిక సేవల దిగ్గజం జెఫ్రీస్ ఇండియా అభిప్రాయపడింది. మూతబడ్డ అమెరికన్ బ్యాంకు ఎస్వీబీ (సిలికాన్ వ్యాలీ బ్యాంకు)తో పోలిస్తే క్రెడిట్ సూసీకి భారత్‌తో కొంత ఎక్కువ అనుబంధమే ఉన్నప్పటికీ .. దానికి ఇక్కడ కార్యకలాపాలు మాత్రం స్పల్పంగా ఉండటమే ఇందుకు కారణమని ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం క్రెడిట్ సూసీకి భారత్‌లో ఒకే ఒక్క శాఖ, రూ. 20,000 కోట్ల కన్నా తక్కువ అసెట్స్ ఉన్నాయి. అంతర్జాతీయంగా కొన్ని బ్యాంకులు మూతబడటం, పలు బ్యాంకులు ఒత్తిడిలో ఉండటం వంటి అంశాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలను రిజర్వ్ బ్యాంక్ నిశితంగా పరిశీలిస్తోందని నివేదిక తెలిపింది. లిక్విడిటీపరమైన సమస్యలేమైనా వస్తే పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైతే ఆర్బీఐ సత్వరం జోక్యం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. భారత్ విషయంలో స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాలేమైనా వచ్చినా తట్టుకుని నిలబడగలదని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు. క్రెడిట్ సూసీ ఇటీవలి కాలంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సౌదీ ఇన్వెస్టరు మరిన్ని పెట్టుబడులు పెట్టబోమంటూ ప్రకటించడంతో రెండు రోజుల క్రితం క్రెడిట్ సూసీ బ్యాంకు షేరు భారీగా పతనమైంది. అయితే, స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) 54 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించడానికి ముందుకు రావడంతో మరుసటి రోజు మళ్లీ కోలుకుంది. భారత్‌లో విదేశీ బ్యాంకులకు కార్యకలాపాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దేశీయంగా అసెట్స్‌లో వాటి వాటా 6 శాతంగా ఉంది. అయితే, డెరివేటివ్ మార్కెట్లలో (ఫారెక్స్, వడ్డీ రేట్లు) మాత్రం అవి చురుగ్గా ఉంటున్నాయి. ఆయా మార్కెట్లలో విదేశీ బ్యాంకులకు 50 శాతం దాకా వాటా ఉంటోంది. -
ఆటో అమ్మకాలకు ఒరిగేదేమీ లేదు
ముంబై: కార్పొరేట్ పన్నును కేంద్ర ప్రభుత్వం ఒకేసారి గణనీయంగా తగ్గించినప్పటికీ... భారీగా పడిపోయిన ఆటోమొబైల్ వాహన డిమాండ్ పునరుద్ధరణపై పరిమిత ప్రభావమే ఉంటుందని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ అభిప్రాయపడింది. కంపెనీలపై 10–12 శాతం పన్నును తగ్గించడం వల్ల అంతిమంగా 1–2 శాతం వరకే ఉత్పత్తులపై తగ్గింపునకు అవకాశం ఉంటుందని ఈ సంస్ధ తన నివేదికలో పేర్కొంది. దీనికి బదులు ప్రభుత్వం జీఎస్టీ 10 శాతం తగ్గింపును ఆఫర్ చేసి ఉంటే, అప్పుడు కంపెనీలకు మేలు జరిగేదని, అవి ఉత్పత్తులపై 7–8 శాతం వరకు (ఆన్‌రోడ్డు ధరలు) తగ్గించేవని తెలిపింది. ఆటోమొబైల్ రంగం రెండు దశాబ్దాల కాలంలోనే అత్యంత ప్రతికూల పరిస్థితులను చవిచూస్తున్న విషయం గమనార్హం. దీంతో వాహన రంగంపై 28 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తోంది. -
ఆన్లైన్ రిటైల్... ఆకాశమే హద్దు!!
ముంబై: దేశ ఆన్లైన్ రిటైల్ మార్కెట్ చాలా వేగంగా ప్రగతి సాధిస్తోందని, 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 170 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. కాంపౌండెడ్‌గా 23 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశ వ్యవస్థీకృత రిటైల్ మార్కెట్లో ఆన్లైన్ రిటైల్ వాటా 25 శాతంగా ఉండగా, 2030 నాటికి 37 శాతానికి పెరుగుతుందని తెలియజేసింది. నివేదికలోని అంశాల మేరకు... ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్ మార్కెట్ పరిమాణం 18 బిలియన్ డాలర్లు. ఒక్కో ఆన్లైన్ షాపింగ్ కస్టమర్ ప్రస్తుతం ఒక ఏడాదిలో రూ.12,800ను ఖర్చు చేస్తుంటే... 2030 నాటికి ఇది రూ.25,138 స్థాయికి పెరుగుతుంది. భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో మొబైల్ ఫోన్స్ సహా ఎలక్ట్రానిక్స్ విభాగంలో భౌతిక రిటైల్ దుకాణాల మార్కెట్ వాటాను ఆన్లైన్ రిటైల్ రంగం సొంతం చేసుకున్నట్లు జెఫ్రీస్ తెలియజేసింది. వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ అనేవి ఆన్లైన్ రిటైల్ రంగానికి ప్రధాన విభాగాలుగా ఉండగా, ఆన్లైన్ గ్రోసరీ విక్రయాలు కూడా పెరుగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. బిగ్‌బాస్కెట్, అమేజాన్ ప్యాంట్రీ ప్రతీ నెలా ప్రారంభంలో ఆఫర్లతో కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు తెలిపింది. సౌకర్యమే ఆకర్షణీయత కొత్త కస్టమర్లు ఆన్లైన్ విభాగానికి రావటమనేది మున్ముందు బాగా పెరుగుతుందని అంచనా వేసిన ఈ నివేదిక... ధరల పరంగా తక్కువ వ్యత్యాసం, సౌకర్యాలు ఇందుకు కారణాలని వివరించింది. వ్యక్తిగత సంరక్షణ, మేకప్ ఉత్పత్తులకూ ఆన్లైన్ మార్కెట్ పెరుగుతున్నట్టు పేర్కొంది. ‘‘ఆన్లైన్ రిటైల్ మార్కెట్ విస్తరణకు ప్రస్తుతం తగ్గింపు ధరలు, సౌకర్యం అన్నవి సానుకూలతలు. మధ్యకాలానికి తగ్గింపులన్నవి క్రమబద్ధీకరణ అవుతాయి. ఆ తర్వాత సౌకర్యం మాత్రమే వినియోగదారులను ఆకర్షించే అంశంగా ఉంటుంది. ఆన్లైన్లో షాపింగ్ చేసే వారిలో ఎక్కువ మందికి ఉత్పత్తుల నాణ్యతపై ఆందోళన ఉంది. నకిలీ వస్తువులు పంపుతున్న ఘటనలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి కూడా. అయితే, ఆన్లైన్ రిటైలర్లు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అప్పటి వరకు కొంత మంది కస్టమర్లు ఆన్లైన్ రిటైల్‌కు దూరంగానే ఉంటారు’’ అని జెఫరీస్ వివరించింది. -
జియో ఎఫెక్ట్..టెలికం ఆదాయం 11% డౌన్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్రభావం టెలికం రంగంపై బాగానే పడింది. పరిశ్రమ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 11.7 శాతం మేర క్షీణించింది. ఇక త్రైమాసికం పరంగా చూస్తే ఆదాయంలో 8.5 శాతం క్షీణత నమోదయ్యింది. జెఫెరీస్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ఆదాయం క్షీణతకు జియో సబ్స్క్రైబర్ల పెరుగుదల, ఉచిత ఆఫర్లు ప్రధాన కారణం. మెట్రోలు, ‘ఏ’ సర్కిళ్లలో అంటే జియో విస్తరణ, వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాం తాల్లో ప్రతికూల ప్రభావం అధికంగా ఉంది. -
జియో వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో... టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ పరిస్థితంతా తలకిందులైన సంగతి తెలిసిందే. దీని దెబ్బకు దిగ్గజ టెలికాం కంపెనీలు భారీగానే నష్టాలు మూటగట్టుకున్నాయి. అయితే ఏకతాటిగా పెరిగిపోతున్న జియో సబ్ స్క్రైబర్ బేస్, 2016-17 వరకు ఆఫర్ చేసిన ఉచిత ఆఫర్లతో ఇండస్ట్రీ రెవెన్యూలు కూడా ఏడాది ఏడాదికి 11.7 శాతం పడిపోయినట్టు జేఫ్ఫెరీస్ రిపోర్టు నివేదించింది. జేఫ్పెరీస్ బుధవారం వెల్లడించిన రిపోర్టులో జియో సబ్ స్క్రైబర్ వృద్ధి, 2016-17 నాలుగో క్వార్టర్ ముగిసేవరకు కంపెనీ ఆఫర్ చేసిన ఉచిత సేవలు ఇండస్ట్రీ రెవెన్యూలను దెబ్బతీశాయని పేర్కొంది. అంతేకాక ఈ ఆర్థిక సంవత్సరంలోనూ సెక్టార్ రెవన్యూలు 38 శాతం పడిపోయే అవకాశముందని టెలికాం డిపార్ట్ మెంట్ అంచనావేస్తోంది. అంటే 17వేల కోట్ల రెవెన్యూలు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ జియో ఎఫెక్ట్ ఎక్కువగా మెట్రోలు, ఏ సర్కిళ్లలో ఉందని, ఈ ప్రాంతాల్లో దీనికి అత్యధిక వ్యాప్తి ఉన్నట్టు తెలిపింది. అక్కడే స్మార్ట్ ఫోన్ ఎకోసిస్టమ్ కూడా మెరుగ్గా అభివృద్ధి చెందిందని కూడా రిపోర్టు వివరించింది. 2016-17 నాలుగో క్వార్టర్ ముగిసే వరకు రిలయన్స్ జియో సబ్ స్క్రైబర్ బేస్ ఎలాంటి బ్రేక్ లు లేకుండా 10.8కోట్ల మేర దూసుకుపోయిందని చెప్పింది. తాజా నెలలోనే జియో అడిక్షన్ కొంచెం తగ్గింది. మొత్తంగా భారత్ లో 4జీ స్మార్ట్ ఫోన్ల బేస్ 13.1 కోట్లుంటే, దానిలో 86 శాతం డివైజ్ లలో జియోనే వాడుతున్నారని జేఫ్ఫెరీస్ వెల్లడించింది. వీరిలో 61 శాతం మంది యాక్టివ్ యూజర్లుగా ఉన్నట్టు పేర్కొంది. డేటా సర్వీసులు ఎక్కువ వృద్ధి చెందడం, వాయిస్ లు పడిపోవడం, ఆపరేటర్లు తక్కువ పెట్టుబడులు వారి రెవెన్యూల పడిపోవడానికి దారితీశాయని ఈ రిపోర్టు చెప్పింది. ప్రస్తుతం టాప్-3లో ఉన్న ఆపరేటర్లే 76 శాతం మార్కెట్ షేరును కలిగిఉన్నారు. కానీ వారి రెవెన్యూలకు దెబ్బపడటం, ఇండస్ట్రీ రెవెన్యూలకు కూడా గండికొడుతోంది.