ముంబై: కార్పొరేట్ పన్నును కేంద్ర ప్రభుత్వం ఒకేసారి గణనీయంగా తగ్గించినప్పటికీ... భారీగా పడిపోయిన ఆటోమొబైల్ వాహన డిమాండ్ పునరుద్ధరణపై పరిమిత ప్రభావమే ఉంటుందని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ అభిప్రాయపడింది. కంపెనీలపై 10–12 శాతం పన్నును తగ్గించడం వల్ల అంతిమంగా 1–2 శాతం వరకే ఉత్పత్తులపై తగ్గింపునకు అవకాశం ఉంటుందని ఈ సంస్ధ తన నివేదికలో పేర్కొంది. దీనికి బదులు ప్రభుత్వం జీఎస్‌టీ 10 శాతం తగ్గింపును ఆఫర్ చేసి ఉంటే, అప్పుడు కంపెనీలకు మేలు జరిగేదని, అవి ఉత్పత్తులపై 7–8 శాతం వరకు (ఆన్‌రోడ్డు ధరలు) తగ్గించేవని తెలిపింది. ఆటోమొబైల్ రంగం రెండు దశాబ్దాల కాలంలోనే అత్యంత ప్రతికూల పరిస్థితులను చవిచూస్తున్న విషయం గమనార్హం. దీంతో వాహన రంగంపై 28 శాతంగా ఉన్న జీఎస్‌టీని 18 శాతానికి తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment