రిలయన్స్‌ జియో మరో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ | Jio's 'Get More Than 100% Cashback Offer' Gives Up To Rs. 700 Cashback | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జియో మరో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

Published Tue, Jan 16 2018 3:30 PM | Last Updated on Tue, Jan 16 2018 8:05 PM

Jio's 'Get More Than 100% Cashback Offer' Gives Up To Rs. 700 Cashback - Sakshi

రిలయన్స్‌ జియో 'సర్‌ప్రైజ్‌ క్యాష్‌బ్యాక్‌' ఆఫర్‌ సోమవారంతో ముగియడంతో, తాజాగా మరో కొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. 398 రూపాయలు, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై మొత్తం 700 రూపాయల వరకు అంటే 100 శాతానికి పైగా క్యాష్‌బ్యాక్‌ను పొందనున్నట్టు జియో పేర్కొంది. రిలయన్స్‌ జియో వెబ్‌సైట్‌ ప్రకారం '100 శాతానికి పైగా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌' జియో ప్రైమ్‌ మెంబర్లకు అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. 2018 జనవరి 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంచనున్నట్టు జియో వెబ్‌సైట్‌ పేర్కొంది. రెండు విధాలుగా యూజర్లు 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందనున్నారు. ఒకటి జియో టారిఫ్‌ ప్లాన్‌ రీఛార్జ్‌, రెండు డిజిటల్‌ వాలెట్ల రీఛార్జ్‌ల ద్వారా ఈ క్యాష్‌బ్యాక్‌ యూజర్లకు లభిస్తుంది. 
 

జియో టారిఫ్‌ ప్లాన్‌ రీఛార్జ్‌....
398 రూపాయలు, లేదా ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై తన ప్రైమ్‌ మెంబర్లకు జియో 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను గ్యారెంటీ ఇస్తోంది.  ప్రతి రీఛార్జ్‌పై 400 రూపాయల విలువైన క్యాష్‌బ్యాక్‌ను, 50 రూపాయల ఎనిమిది ఓచర్ల రూపంలో అందిస్తుంది. ఇవి కస్టమర్ల అకౌంట్‌లోకి వెంటనే క్రెడిట్‌ అవుతాయి. మైజియో యాప్‌లో మై ఓచర్లలో ఇవి కనిపిస్తాయి. ఈ ఓచర్లను తర్వాత చేసుకునే 300 రూపాయలు, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రిడీమ్‌ చేసుకోవచ్చు. 

డిజిటల్‌ వాలెట్ల రీఛార్జ్‌...
దిగ్గజ డిజిటల్‌ వాలెంట్లతో జియో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఫ్రీఛార్జ్‌, మొబిక్విక్‌, పేటీఎం, అమెజాన్‌ పే, ఫోన్‌పే, భీమ్‌, యాక్సిస్‌పే ద్వారా పేమెంట్‌ చేసిన జియో ప్రైమ్‌ మెంబర్లకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ కింద రూ.300 వరకు అందిస్తుంది. అంటే మొత్తంగా 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ జియోప్రైమ్‌ మెంబర్లకు ఆఫర్‌ చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement