jio prime
-
జియో ప్రైమ్ రెన్యూవల్ ఆప్షన్ కనిపించడం లేదా?
జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ గడువు ముగిసిపోయింది. ఇప్పటికే జియో ప్రైమ్ మెంబర్లుగా ఉన్న వారికి మరో ఏడాది పాటు ఈ సర్వీసులను ఉచితంగా అందించనున్నట్టు జియో ప్రకటించింది. అయితే ఈ రెన్యూవల్ ప్రక్రియ ఆటోమేటిక్‌గా యూజర్లకు క్రెడిట్ అవడం లేదు. జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను మరో ఏడాది పాటు పొడిగించుకోవడానికి యూజర్ అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మైజియో యాప్‌లో ఒక మెసేజ్ వస్తోంది. కానీ చాలా మంది యూజర్లకు ఈ మెసేజ్ రావడం లేదని తెలుస్తోంది. దీంతో యూజర్లు ఈ ఉచిత రెవెన్యూల విషయంలో ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఈ ఇబ్బందుల నుంచి బయటపడి, మరో ఏడాది పాటు ప్రైమ్ మెంబర్‌షిప్‌ను యాక్టివేట్ చేసుకునే మార్గమేమిటో ఓ సారి చూద్దాం... మీరు రూ.99 సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసిన జియో యూజర్ అయినప్పటికీ ప్రైమ్‌ను పొడిగించుకోవడానికి మెసేజ్ రాకపోతే, ముందుగా జియో యాప్‌ను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 15 నిమిషాల పాటు వీడియోలను స్ట్రీమ్ చేయాలి. ఆ తర్వాత మరోసారి జియో యాప్‌ను తిరిగి స్టార్ట్ చేయాలి. ఏ నెంబర్‌కు అయితే జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ పొడిగించాలనుకుంటున్నారో ఆ నెంబర్‌ను వాడుతూ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో జియో యాప్‌లో బ్యానర్ పేజీలో జియో ప్రైమ్ మెంబర్షిప్ రెన్యూవల్ ఆప్షన్ కనిపిస్తోంది. ఆ ఆప్షన్‌పై యూజర్లు అప్లయ్ చేసుకోవాలి. స్టాండర్డ్ రెన్యూవల్ ప్రాసెస్‌ను యూజర్లు ఫాలో అవ్వాలి. బ్యానర్లో గెట్ నౌ అనే బటన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ బటన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత మరో ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్‌ను పొడిగిస్తున్నట్టు ఒక మెసేజ్ వస్తుంది. అదేవిధంగా రిజిస్ట్రర్ నెంబర్లు కూడా వస్తాయి. ఆ నెంబర్లలో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ పొడిగించాలనుకున్న నెంబర్‌ను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో ఈ సబ్స్క్రిప్షన్ ప్రక్రియ పూర్తైపోతోంది. -
జియో యూజర్లకు గుడ్‌న్యూస్
రిలయన్స్ జియో ప్రైమ్ సభ్యత్వం తుది గడువు రేపటితో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో తన ప్రస్తుత జియో ప్రైమ్ మెంబర్లకు జియో గుడ్‌న్యూస్ చెప్పింది. అదనంగా ఏడాది పాటు కాంప్లిమెంటరీ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందియనున్నట్టు జియో ప్రకటించింది. ఇంకా ఒక్క రోజుల్లో తన ప్రైమ్ మెంబర్షిప్ గడువు ముగియనున్న నేపథ్యంలో జియో ఈ గుడ్‌న్యూస్ చెప్పింది. మైజియో యాప్‌లోకి లాగిన్ అయి జియో మెంబర్లు కాంప్లిమెంటరీ జియో మెంబర్‌షిప్‌ను ఎంచుకుంటే, మరో ఏడాది పాటు కాంప్లిమెంటరీ ఫ్రీ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. కాగ, గతేడాది జియో 99 రూపాయలతో ఈ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త జియో యూజర్లకు కూడా ప్రైమ్ మెంబర్షిప్ ధర అదేవిధంగా ఉంటుందని జియో తెలిపింది. అంటే కొత్త యూజర్లు రూ.99 చెల్లించి ప్రస్తుతం ఈ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందాల్సి ఉంటుంది. పాత యూజర్లకు మాత్రానికి ఉచితంగా మరో ఏడాది పాటు ఈ సర్వీసులను పొడిగించుకోవచ్చు. గతేడాది తీసుకొచ్చిన జియో ప్రైమ్, రిలయన్స్ జియో కస్టమర్లకు ఏడాది సభ్యత్వం లాంటిది. దీనిలో ఎవరైతే రూ.309 లేదా ఆపై మొత్తాల రీఛార్జ్‌తో పాటు వన్-టైమ్ వార్షిక ఫీజు కింద 99 రూపాయలు చెల్లించారో వారికి ఈ సభ్యత్వం కల్పించింది. ఈ ఎన్‌రోల్‌మెంట్‌తో పలు ప్రయోజనాలను యూజర్లు పొందుతారు. కేవలం 399 రూపాయల ఛార్జ్‌తోనే ఉచితంగా అపరిమిత వాయిస్ కాల్స్‌ను, ఎస్ఎంఎస్లను, 4జీ డేటాను యూజర్లు 70 రోజుల పాటు పొందవచ్చు. జియో ప్రైమ్ యూజర్లు కొన్ని ప్రత్యేక ప్లాన్స్‌ను కూడా ఉన్నాయి. అంతేకాక ఏడాది పాటు వెయ్యి రూపాయల విలువైన జియో ప్రీమియం కంటెంట్‌ను పొందవచ్చు. ఎప్పటికప్పుడు జియో ప్రైమ్ యూజర్లకు ఆఫర్లను, డీల్స్‌ను జియో ప్రకటిస్తూ వచ్చింది. అంతేకాక జియో యాప్స్ అన్ని ఉచితంగా లభించాయి. ఈ యాప్స్‌తో మూవీస్, వీడియో లాంటి మ్యూజిక్, కంటెంట్‌ను యూజర్లు ఉచితంగా పొందుతున్నారు. -
రిలయన్స్ జియో మరో క్యాష్‌బ్యాక్ ఆఫర్
రిలయన్స్ జియో 'సర్ప్రైజ్ క్యాష్‌బ్యాక్' ఆఫర్ సోమవారంతో ముగియడంతో, తాజాగా మరో కొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. 398 రూపాయలు, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై మొత్తం 700 రూపాయల వరకు అంటే 100 శాతానికి పైగా క్యాష్‌బ్యాక్‌ను పొందనున్నట్టు జియో పేర్కొంది. రిలయన్స్ జియో వెబ్సైట్ ప్రకారం '100 శాతానికి పైగా క్యాష్‌బ్యాక్ ఆఫర్' జియో ప్రైమ్ మెంబర్లకు అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. 2018 జనవరి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంచనున్నట్టు జియో వెబ్సైట్ పేర్కొంది. రెండు విధాలుగా యూజర్లు 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందనున్నారు. ఒకటి జియో టారిఫ్ ప్లాన్ రీఛార్జ్, రెండు డిజిటల్ వాలెట్ల రీఛార్జ్‌ల ద్వారా ఈ క్యాష్‌బ్యాక్ యూజర్లకు లభిస్తుంది. జియో టారిఫ్ ప్లాన్ రీఛార్జ్.... 398 రూపాయలు, లేదా ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై తన ప్రైమ్ మెంబర్లకు జియో 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను గ్యారెంటీ ఇస్తోంది. ప్రతి రీఛార్జ్‌పై 400 రూపాయల విలువైన క్యాష్‌బ్యాక్‌ను, 50 రూపాయల ఎనిమిది ఓచర్ల రూపంలో అందిస్తుంది. ఇవి కస్టమర్ల అకౌంట్లోకి వెంటనే క్రెడిట్ అవుతాయి. మైజియో యాప్‌లో మై ఓచర్లలో ఇవి కనిపిస్తాయి. ఈ ఓచర్లను తర్వాత చేసుకునే 300 రూపాయలు, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రిడీమ్ చేసుకోవచ్చు. డిజిటల్ వాలెట్ల రీఛార్జ్... దిగ్గజ డిజిటల్ వాలెంట్లతో జియో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఫ్రీఛార్జ్, మొబిక్విక్, పేటీఎం, అమెజాన్ పే, ఫోన్‌పే, భీమ్, యాక్సిస్‌పే ద్వారా పేమెంట్ చేసిన జియో ప్రైమ్ మెంబర్లకు ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ కింద రూ.300 వరకు అందిస్తుంది. అంటే మొత్తంగా 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ జియోప్రైమ్ మెంబర్లకు ఆఫర్ చేస్తుంది. -
జియో కాల్స్ అన్ లిమిటెడ్ కాదా...?
ముంబై: జియో ఉచిత అపరిమిత కాల్స్ తో టెలికాం మార్కెట్ ను ఓ ఊపు ఊపింది. ఇటీవల జియో ప్రైమ్ పేరుతో రూ99 లతో ఏడాది పాటు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు అంటూ ఓ ప్రకటన చేసింది. కాకపోతే అతి వాస్తవం కాదంటూ ఇంటర్నెట్ లో ఓవార్త హల్చల్ చేస్తోంది. జియో ప్రైమ్‌లో నెలకు కేవలం 1000 కాల్స్ మాత్రమే అందివ్వబోతున్నట్లు సమాచారం. అంటే రోజుకు 33నిమిషాలు మాత్రమే. రూ.149 నుంచి ఏ ప్లాన్ తీసుకున్నా నెలకు 1000 నిమిషాలు మాత్రమే మాట్లాకోవచ్చు. జియో ప్రైమ్‌లో కేవలం రూ.10లకే 1జీబీ డేటా అందిస్తోంది. అంతే కాకుండా రూ.303తో నాన్ జియో ప్రైమ్ నెంబర్లకు 2.5జీబీ డేటా 30రోజుల కాల పరిమితి ఉంటుంది. 2.5జీబీ పరిమితి అనంతరం 1జీబీ డేటా రూ.121 కు లభిస్తుంది. నాన్ జియో ప్రైమ్ వినియోగ దారులకు రూ.303, 499,999 ప్లాన్లును అందుబాటులోకి తేనుంది.