జేఎల్ఆర్ ‘ఎక్స్ఈ’ కొత్త వేరియంట్.. ప్రెస్టీజ్ | JLR launches variant of Jaguar XE, priced at Rs 43.69 lakh | Sakshi
Sakshi News home page

జేఎల్ఆర్ ‘ఎక్స్ఈ’ కొత్త వేరియంట్.. ప్రెస్టీజ్

Published Fri, Jun 10 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

జేఎల్ఆర్ ‘ఎక్స్ఈ’ కొత్త వేరియంట్.. ప్రెస్టీజ్

జేఎల్ఆర్ ‘ఎక్స్ఈ’ కొత్త వేరియంట్.. ప్రెస్టీజ్

రూ.43.69 లక్షలు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ తన స్పోర్ట్స్ సలూన్ జాగ్వార్ ఎక్స్‌ఈలో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. జాగ్వార్ ఎక్స్‌ఈ ప్రెస్టీజ్ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.43.69 లక్షలు (ఎక్స్ ముంబై, ఆక్ట్రాయ్ పన్ను కాకుండా)గా నిర్ణయించామని టాటా మోటార్స్ తెలిపింది.  ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్లోకి తెచ్చిన ప్యూర్( ధర రూ.39.9 లక్షలు), పోర్ట్‌ఫోలియో(ధర రూ.47.99 లక్షలుగా) వేరియంట్లకు ఇది అదనమని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరి చెప్పారు. 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో రూపొం దించిన ఈ కారులో ఆల్ సర్ఫేస్ ప్రొగ్రెస్ కంట్రోల్(ఏఎస్‌పీసీ) వంటి అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ టెక్నాలజీ, సన్ రూఫ్, టారస్ లెదర్ సీట్లు, 380 వాట్ల మెరిడియన్ సౌండ్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా, 8 గేర్లు(ఆటోమేటిక్)  వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.  మెర్సిడెజ్ బెంజ్ సి-క్లాస్, బీఎండబ్ల్యూ 3 సిరీస్ కార్లకు ఈ జాగ్వార్ ఎస్‌ఈ ప్రెస్టీజ్ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement