సాక్షి,న్యూఢిల్లీ: ఆధార్ నంబర్‌తో అనుసంధానంపై మరో షాకింగ్ న్యూస్‌ను బీమా రెగ్యులేటరీ సంస్థ ప్రకటించింది. బీమా పాలసీలతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆధార్ అనుసంధానం చేయడం తప్పని సరి అని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) వెల్లడించింది. ప్రివెన్షన్ ఆఫ్‌మనీ లాండరింగ్ చట్టం 2017సవరించిన నిబంధనల ప్రకారం ఇది మాండేటరీ అని తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశంలోని అన్ని బీమా సంస్థలకు సమాచారాన్ని అందించింది. అలాగే బీమాపాలసీలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని పాలసీదారులను కోరింది.
అన్ని బీమా పాలసీలకు కూడా ఆధార్, పాన్ నంబర్లతో అనుసంధానం తప్పనిసరి అని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న, కొత్త బీమా పాలసీలకు కూడా ఆధార్, పాన్ నంబర్లను అనుసంధానించాలని స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వం నిర్ణయంపై స‍్పందించిన ఐసీఐసీఐ లాంబార్డ్ సీఎండీ భార్గవ్ దాస్‌గుప్తా ఆర్థిక సేవల కోసం ఏకీకృత వేదికను సృష్టించేందుకు, అదే సమయంలో ప్రభుత్వాల డిజిటైజేషన్ ఎజెండాను ప్రోత్సహించేందుకు ఇదొక ప్రగతిశీల ముందడుగు అని వ్యాఖ్యానించారు. ఆరంభంలో స్వల్పకాలిక సవాళ్లను అధిగమించాల్సి ఉన్నప్పటికీ మోసాలను , అక్రమాలను నిరోధించే క్రమంలో ఇది గణనీయమైన దీర్ఘకాల ప్రయోజనాలను ఉంటాయని ఆయన చెప్పారు.
కాగా దేశంలో మొత్తం 24 జీవిత బీమా సంస్థలు, 33 జనరల్ ఇన్స్యూరెన్స్ సంస్థలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో ఇక మీదట ఈ కంపెనీల పాలసీలన్నీ ఇక ఆధార్ తో అనుసంధానించుకోవాలి. ఇప్పటికే జీవిత బీమా సంస్థలు బీమా క్లెయిములను నగదు రూపంలో చెల్లించకుండా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తోంది. రూ.50వేలకు మించిన బీమా ప్రీమియం చెల్లింపులకు పాన్కార్డు నంబరు ఇవ్వాలని బీమా సంస్థలు కోరుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment