లక్కీడిప్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను లక్కీడిప్ (కంప్యూటర్ ర్యాండమ్)లో కేటాయించే పద్ధతిని శనివారం తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు ప్రారంభించారు. 2010 నుంచి ఇప్పటివరకు ఇదే లక్కీడిప్ పద్ధతిలో తోమాల, అర్చన, అభిషేకం, మేల్‌ఛాట్ వస్త్రం వంటి అరుదైన ఆర్జిత సేవా టికెట్లు కేటాయిస్తున్నారు. తాజాగా నిత్యసేవలైన సుప్రభాతం (100 టికెట్లు), కల్యాణోత్సవం (80), వారపు సేవలైన విశేషపూజ (సోమవారం- 125), సహస్ర కలశాభిషేకం (మంగళవారం-25), తిరుప్పావడసేవ (గురువారం-25), నిజపాద దర్శనం ( శుక్రవారం-100) టికెట్లు కేటాయించారు.
టికెట్లను పారదర్శకంగా కేటాయించడంతోపాటు గంటల తరబడి క్యూలో నిలబడకుండా ఉండేందుకు లక్కీడిప్ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జేఈవో శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈవో వేణుగోపాల్ చెప్పారు.