
మ్యాజిక్ బ్రిక్స్ చేతికి ప్రోపర్టీడాట్కామ్
న్యూఢిల్లీ: రియల్టీ పోర్టల్ మ్యాజిక్‌బ్రిక్స్‌డాట్‌కామ్ సంస్థ ప్రొపర్టీ విశ్లేషణ ప్లాట్‌ఫార్మ్ ప్రోపర్జీడాట్‌కామ్‌ను కొనుగోలు చేసింది. కొనుగోలు వివరాలను మ్యాజిక్‌బ్రిక్స్‌డాట్‌కామ్ వెల్లడించలేదు. 2013లో బెంగళూరులో ప్రారంభమైన ప్రోపర్జీడాట్‌కామ్ సంస్థ ప్రోపర్టీ అధ్యయన నివేదికలను కొనుగోలు దారులకు అందిస్తుంది. ప్రోపర్టీ కొనుగోలుదారులు నిర్ణయాలు తీసుకోవడంలో ప్రోపర్జీడాట్‌కామ్ అందించే సమాచారం ఇతోధికంగా ఉపయోగపడుతుందని, అందుకని ప్రోపర్జీడాట్‌కామ్‌ను నిర్వహించే ఇన్‌వాక్ట్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేశామని మ్యాజిక్‌బ్రిక్స్‌డాట్‌కామ్ సీఈఓ సుదీర్ పాయ్ చెప్పారు. ఇది తమ తొలి కొనుగోలు అని ఈ సందర్భంగా తెలిపారు.