
సాక్షి,ముంబై: ప్రముఖ ద్విచక్ర తయారీ సంస్థ మహీంద్ర ఊహించని ధరలో ఓ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా టూరింగ్ ఔత్సాహికులకు విస్తృతమైన రైడింగ్ అవకాశాలను కల్పించేలా తన పాపులర్ మోడల్ మోజోలో ప్రీమియం స్పోర్ట్స్ టూరర్ స్పెషల్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చిది. దీని ప్రారభ ధర రూ.1.49 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించింది. దీనికి తోడు ఆకర్షణీయమైన లాంచింగ్ ఆఫర్ కూడా ఉంది.
మోజో యూటీ 300 పేరుతో ఈ 300 సీసీ బైక్‌ను లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా 60 నగరాల్లో విస్తృతంగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను అందుబాటులో ఉంచామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రకాష్ వకాన్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 300సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజీన్,కాంపాక్ట్ డిజిటల్ ప్యానెల్, కార్‌బ్యురేటర్ ఫ్యూయల్ సిస్టం, 17ఇంచెస్ ట్యూబ్‌లెస్ టైర్లు, 21లీటర్ల ఫ్యుయల్ ట్యాంక్ దీని ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి.
లాంచింగ్ ఆఫర్: మార్చి నెలల బుకింగ్‌పై స్పెషల్ ఆఫర్‌కూడా అందిస్తోంది. లాంచింగ్ ఆఫర్‌గా మార్చి నెల బుకింగ్‌లపై రూ.10 వేల ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. అంటే ఈ తగ్గిపు తరువాత మోజో యూటీ 300 ధర రూ.1.39లక్షలుగా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment